Bigg Boss 6: ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ అవుట్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారం వీకెండ్‌కు చేరుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారు. కెప్టెన్ రేవంత్, కీర్తిని మినహాయిస్తే మిగతా వాళ్లంతా నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. రేవంత్ లేకపోవడంతో ఇనయాకు ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో తరువాతి స్థానాల్లో శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో మాత్రం రాజ్, ఫైమా ఉన్నారు. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో ఆమె సేవ్ అయ్యిందని.. దీంతో రాజ్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు గాసిప్ రాయుళ్లు ప్రచారం చేస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో రాజ్ కాంట్రవర్సీలకు దూరంగా ఉండేవాడు. హౌస్‌లో అతడితో ఫైమా, ఇనయా ఎక్కువ క్లోజ్‌గా ఉండేవాళ్లు. చలాకీ చంటి ఉన్న సమయంలో రాజ్‌పై ఎన్నో జోకులు వేసేవాడు.
Read Also: Heroines: ఐకానిక్ పాత్రలను వదులుకున్న హీరోయిన్లు.. చేసి ఉంటేనా
Also Read
అటు గత రెండు వారాల నుంచి రాజ్ నామినేషన్లలో లేడు. ఈసారి అందరూ కావాలని అతడిని నామినేట్ చేశారు. దీంతో అతడు నామినేషన్స్‌లోకి రావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మిగతా వాళ్లతో పోలిస్తే ఈ వారం అతడికే తక్కువ ఓట్లు పడినట్లు కనిపిస్తోంది. మోడల్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన రాజ్ ఆరంభంలో సైలెంట్‌గా ఉండేవాడు. ఆ తర్వాత తన ఆటతీరు, మాటతీరు మార్చుకున్నాడు. మాట్లాడేది తక్కువే అయినా సరే కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతాడని హౌస్ మేట్లతో పాటు హోస్ట్ నాగార్జున కూడా చాలాసార్లు మెచ్చుకున్నాడు. గతవారం కూడా చెక్ అమౌంట్ టాస్కులో తన తెలివి ఉపయోగించి నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు.
Read Also: Bhanu Prakash Reddy: ఏపీలో చర్చిల నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!