Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ సెలబ్రిటీ గేమ్ షో ఇప్పుడు ఎనిమిదో వారం చివరికి వచ్చేసింది. షో మొదలైన రోజు 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా గత ఏడు వారాల్లో ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. ఇక ఆరో వారంలో మరో ఎనిమది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి అడుగు పెట్టగా పాత, కొత్త కంటెస్టెంట్లతో ఇంట్రెస్టింగ్ గా మారింది బిగ్ బాస్ హౌస్. ఇక వీకెండ్ వచ్చింది కాబట్టి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న ఆసక్తి అందరిలో ఉంది.
Also Read: Chuttamalle: చుట్టమల్లే చుట్టడానికి వచ్చేసింది.. చూశారా?
నిజానికి ఈ వారంలో మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావనిలు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరికి శుక్రవారం అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో నిఖిల్, ప్రేరణ , విష్ణు ప్రియ, పృథ్వీలు టాప్ 4 నాలుగో ప్లేసులలో ఉన్నారు. అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన మెహబూబ్ దిల్ సే, నయని పావనిలు అసలు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరికీ అతి తక్కువగా ఓట్లు పడగా వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఈ షో నుంచి మెహబూబ్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. అతను గతంలో చేసిన కమ్యూనిటీ కామెంట్స్ అసలు చిక్కులు తెచ్చిపెట్టినట్టు సమాచారం.