బిగ్ బాస్ లో ఆట మొదలైంది.. వైల్డ్ కార్డు ఎంట్రీ తో వచ్చిన వాళ్లు కూడా అస్సలు తగ్గలేదు.. ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ రెండు టీమ్స్ చేసి.. గేమ్ రసవత్తరంగా మార్చేశారు.. కొత్తగా వచ్చిన వారికి పవర్స్ ఇచ్చి పాతవాళ్ళను ఓ రేంజులో ఆడుకున్నాడు బిగ్ బాస్.. నామినేషన్స్ అంటూ ఈ రెండు టీమ్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్బాస్.. ఇప్పుడు వరుస టాస్కులతో చుక్కలు చూపిస్తున్నాడు. అయితే బిగ్బాస్ షో స్టార్ట్ అయ్యి ఆరు వారాలు పూర్తి కావొస్తుంది. ఇప్పటివరకు ఐదు ఎలిమినేషన్స్ జరిగిపోయాయి.
అయితే అందరూ లేడీ కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు కూడా మరో లేడీ కంటెస్టెంట్ రెడీ అయిపోయింది. సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈసారి కూడా అమ్మాయి ఎలిమినేట్ అవుతుందని టాక్.. ఇక ఆరోవారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి.. యావర్, అమర్ దీప్, టేస్టీ తేజా, నయని పావని, పూజా మూర్తి, అశ్విని శ్రీ, శోభా శెట్టి నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురిలో ఈ వారం తన కామెడీతో ఎంటర్టైన్ చేయడమే కాకుండా తేజ కోసం లెటర్ త్యాగం చేసిన ప్రిన్స్ యావర్ కు అత్యధిక ఓటింగ్ వచ్చేసింది. ఇక డేంజర్ జోన్ లో శోభా శెట్టి ఉన్నట్లు తెలుస్తుంది..
38.17%తో ప్రిన్స్ యావర్ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. ఇక హీరో అనుకుంటే జీరో అయిన అమర్ దీప్ ఈ వారం తన తప్పులేంటో తెలుసుకునే పనిలో పడ్డాడు. అలాగే తన ఆట తను ఆడేందుకు ట్రై చేస్తున్నాడు. ఈవారం 18.55% ఓటింగ్ తో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఎప్పటిలాగే తన కామెడీ పంచులతో అలరించిన టేస్టీ తేజ 14.56% ఓటింగ్ తో నాలుగో స్థానంలో నిలిచాడు.. కొత్తగా వచ్చిన అశ్విని కూడా బాగానే ఓట్లను సంపాదించింది.. శోభా శెట్టికి 4.5% ఓటింగ్ వచ్చింది. అయితే ఇప్పటికీ తన ఆట తీరు మార్చుకోకుండా కన్నింగ్ గేమ్ ఆడుతోన్న శోభా ఈ వారం బయటకు వెళ్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. సేఫ్ జోన్ లో ప్రియాంక ఉంది.. మరి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో చూడాలి..