కొన్ని టాస్క్ లలో కండబలం కారణంగా ఓడిపోతున్నామని వాపోతున్న యానీ మాస్టర్ మొత్తానికీ ఆదివారం నాకౌట్ గేమ్ లో ఆరు రౌండ్స్ లో విజేతగా నిలబడి, స్పెషల్ పవర్స్ ను పొందడం విశేషం. సండే ఎపిసోడ్ ప్రారంభంలోనే నాగార్జున నాకౌట్ గేమ్ ను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా పట్టుకోండి చూద్దాం, సినిమా క్విజ్, నీళ్ళు – కన్నీళ్ళు, మ్యూజికల్ ఛైర్స్, పట్టు పట్టు రంగే పట్టు, టోపీ – పోటీ అంటూ ఆరు స్టేజీలలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు గేమ్స్ కండక్ట్ చేశాడు. ఒక్కో స్టెప్ ను అధిగమిస్తూ ముందుకు సాగిన యాని మాస్టర్, చివరి రౌండ్ ‘టోపీ -పోటీ’లో తన గ్రూప్ సభ్యుల సహకారంతో విశ్వ మీద విజయం సాధించారు. అయితే ఆమెకు లభించిన స్పెషల్ పవర్ ఏమిటీ అనేది బిగ్ బాస్ చెబుతాడని నాగ్ తెలుపడం కొసమెరుపు. మొత్తం మీద కండబలమే కాకుండా బుద్ధిబలం, సమయస్ఫూర్తితోనూ కొన్ని టాస్క్ లు గెలవవచ్చని యానీ మాస్టర్ నిరూపించినట్టు అయ్యింది!
Read Also : డ్రగ్స్ ఎఫెక్ట్… పాన్ ఇండియా మూవీ నుంచి బాలీవుడ్ బ్యూటీ అవుట్ ?