తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. గత వారం వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో ఆట స్వరూపం మారిపోయింది. అటు ఆటతో.. ఇటు ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను అలరిస్తున్నారు కంటెస్టెంట్లు. ఇక ఈ వారం ఏకంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ మెగా చీఫ్గా కూడా ఎన్నికవగా వైల్డ్ కార్డ్ సభ్యులు ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటి ఎలిమినేషన్ కావడంతో ఆరో వారంలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారనే విషయంలో ఆడియన్స్లో కాస్త క్యూరియాసిటీ ఉంది. వైల్డ్ కార్డ్ సభ్యులు ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటి నామినేషన్లు కావడంతో కేవలం వైల్డ్ కార్డ్ సభ్యులు మాత్రమే ఓజీ క్లాన్ సభ్యులలో ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేశారు. అలా మొత్తానికి ఆరో వారం నామినేషన్లలో యష్మీ, విష్ణుప్రియ, సీత, పృథ్వీ ఉండగా.. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలుగా వచ్చిన మెహబూబ్, గంగవ్వ కూడా నామినేట్ అయ్యారు.
Chiranjeevi: చంద్రబాబు నివాసానికి చిరు.. ఎందుకంటే?
ఈ వారం నామినేషన్ల ప్రక్రియ రెండు రోజుల పాటు జరిగడంతో ఓటింగ్ ప్రాసెస్ మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యి శుక్రవారం రాత్రి ఎండ్ అయ్యింది. ఇక అన్ అఫీషియల్ ఓటింగ్ లెక్కలు చూస్తే గంగవ్వ టాప్లో ఉన్నట్లు సమాచారం. ఇక ఆ తర్వాతి స్థానంలో మెహబూబ్, యష్మీ, విష్ణుప్రియ ఉన్నట్లు సమాచారం. ఇక ఐదు, ఆరు స్థానాల్లో పృథ్వీ, కిర్రాక్ సీత ఉన్నారని అంటున్నారు. విష్ణుప్రియ, పృథ్వీ, సీత డేంజర్ జోన్లో ఉన్నారని ప్రచారం జరగగా ఇప్పుడు బిగ్ బాస్ లీక్స్ ప్రకారం సీత ఎలిమినేట్ అయిందని అంటున్నారు. అయితే ఈ విషయం అఫీషియల్గా తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే. అయితే సీత ఎలిమినేషన్ ఓ రకంగా ఆడియన్స్కు షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి రెండు వారాల్లో అదరగొట్టి చీఫ్ అయిన సీత.. ఆ తర్వాత వారాల్లో చాలా డల్ అయింది, ఆమెకు ఫాన్ ఫాలోయింగ్ పెద్దగా లేకపోవడంతో ఆమె బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.