Bigg Boss 7 Telugu: ప్రియాంక లెక్కలు చూసి షాకైన నాని.. యావర్ కు తెలుగు క్లాస్.. ఎపిసోడ్ మాములుగాలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో ప్రస్తుతం 13 వ వారంలో ఉంది.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని టెన్షన్ ఉన్నా.. వీకెండ్ సండే ఎపిసోడ్ ఫన్ మాములుగా ఉండదు… ప్రతి వారం ఏదొక సెలెబ్రేటి వచ్చినట్లే ఈ వారం కూడా వచ్చారు.. హాయ్ నాన్న ప్రమోషన్ లో భాగంగా ఆ సినిమా హీరో న్యాచురల్ స్టార్ నాని షోకు వచ్చారు.. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం హాయ్ నాన్న ప్రమోషన్లలో బిజీగా ఉన్న నాని.. ఈరోజు బిగ్‌బాస్ స్టేజ్ పైకి వచ్చేశాడు. బిగ్‌బాస్ సెకండ్ సీజన్ హోస్ట్ చేసిన నాని.. ఆ తర్వాత నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు.
ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో.. ముందుగా నాని మోడల్స్ తో చిందులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాగార్జున వస్తూ.. నాన్నా.. ఏంటీ ఇక్కడా.. ఇది సీజన్ 7.. సీజన్ 2 కాదు అంటూ పంచ్ వేశారు. నాగ్ ను నాని హగ్ చేసుకున్నాడు.. ఆ తర్వాత హాయ్ నాన్న విశేషాలను పంచుకున్నారు.ఇక తర్వాత హౌస్మేట్స్ ను పరిచయం చేశాడు నాగ్. ముందుగా అర్జున్ అంబటి.. కానీ అసలు పేరు అంబటి నాగార్జున అని పరిచయం చేయడంతో.. మీరు ఈ సీజన్ గెలిస్తే హోస్ట్ నాగార్జున .. విన్నర్ నాగార్జున అని అన్నాడు నాని.. రావాలని కోరుకుంటున్న అని అన్నారు..
Also Read
అందరితో నాని ముచ్చటించారు.. ఆ క్రమంలో ప్రియాంక గురించి చెబుతూ.. తన గురించి ఒకటి చెప్పాలి. మ్యాథ్స్ టేబుల్స్ వచ్చా ?… నాగ్ అడగ్గా.. కొంచం కొంచం వచ్చు అని అన్నాడు నాని. దీంతో 4*8 ఎంత అని అడిగితే 32 అంటూ అనుమానంగానే చెప్పిన కరెక్ట్ చెప్పాడు. కానీ ప్రియాంక ఎంతో చెబుతుందో తెలుసా అంటూ వీడియోను చూపించారు. అందులో సంచాలక్ గా ఉన్న ప్రియాంక, శోభా ఇద్దరు అమర్ రింగ్స్ కౌంట్ చేస్తూ.. 4*8 .. 48 అంటూ ఠక్కున చెప్పేసింది. ఈ వీడియో చూడగానే నానితోపాటు హౌస్మేట్స్ షాకయ్యారు.. యావర్ కు తెలుగు క్లాస్ చెప్పడం షో కు హైలెట్ అయ్యింది.. ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఎపిసోడ్ మొత్తం చూడాల్సిందే..
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!