తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం 7 వ సీజన్ ను జరుపుకుంటుంది.. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకొని ముగ్గురిని ఎలిమినేట్ చేసింది.. ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ను పూర్తి చేసింది బిగ్ బాస్.. నాలుగో పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే..
నాలుగవ వారం మధ్యలో నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ హౌస్ నుంచి బయటకు వచ్చారని తెలుస్తోంది..బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించి ఏ విషయమైనా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కావాలనే మేకర్స్ ఇలాంటి విషయాలను లీక్ చేస్తారా లేక ఈ విషయాలన్నీ బయటకు ఎలా వస్తాయో తెలియదు కానీ ఎపిసోడ్ ప్రసారం కాకుండానే కీలక విషయాలు బయటకు వస్తుంటాయి.. ఇందులో కొత్తేమి లేదు.. అయితే తాజాగా నాలుగో వారం జరుగుతూ ఉండగానే పల్లవి ప్రశాంత్ హౌస్ నుంచి బయటకు వచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ఇప్పుడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చారని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..ఈయన బయటికి రావడానికి మరే కారణం లేదు తాజాగా బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్కులో గార్డెన్ లో ఉన్న ఏటీఎం నుంచి కాయిన్స్ కలెక్ట్ చేయమని చెబుతారు. ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వారు పవర్ అస్త్ర పొందడానికి అర్హులు అని చెప్పడంతో కంటెస్టెంట్లు పోటాపోటీగా కాయిన్స్ కలెక్ట్ చేయడానికి పరుగులు తీస్తారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ కింద పడటంతో ఆయన తలకు తీవ్రమైనటువంటి గాయం అయింది.. అందుకే హౌస్ లోంచి చికిత్స కోసం బయటకు పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మళ్లీ హౌస్ లోకి వెళ్ళవచ్చు అని ం
కూడా వార్తలు వినిపిస్తూన్నాయి.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియదు.. ఈరోజు ఎపిసోడ్ లో క్లారిటీ రావొచ్చునని సమాచారం..