బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ మొదలై వారం పూర్తి కావొస్తుంది.. ఈ వారం అంతా కొట్టుకున్నా, ఏడ్చినా వీకెండ్ రెండు రోజులు మాత్రం నాగార్జున వచ్చి హంగామా చేస్తారు.. ఇక శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగ్ అందరికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.. ఇకపోతే ప్రతి సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ప్రేమకలాపాలు మొదలైయ్యాయి.. ప్రశాంత్ – రతిక ప్రేమ వ్యవహారం ముదిరిపోయింది. ఈసారి ఏకంగా మోకాలిపై కూర్చొని రతిక కు ప్రపోజ్ చేసాడు ప్రశాంత్. ఇక రతిక తింటుంటే ఆమె దగ్గరకు వెళ్లి తినిపించమని ఓవర్ యాక్షన్ చేశాడు. ప్రిన్స్ – శుభశ్రీ మధ్య గొడవ జరిగింది. దీంతో నాగ్ ప్రిన్స్ కి క్లాస్ పీకాడు. శోభా ముందు నుంచే ఏడుస్తుందని నాగ్ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు.
అలాగే ఇచ్చిన టాస్క్ లో ఫెయిల్ అయినందుకు వారం రోజులు వాష్ రూమ్ క్లీన్ చేయాలని పనిషమెంట్ ఇచ్చాడు నాగ్.. బిగ్ బాస్ లోని ఒక్కొక్కరి గురించి ఒక్కోలా జనాలు అనుకుంటున్నారని నాగ్ అందరికి వివరించాడు.. కంటెస్టెంట్స్ కి ఫ్యాన్స్ పల్స్ మార్కులు చెప్పేముందు ఈ వారం రోజులకి మీకు మీరు ఎంత మార్కులు వేసుకుంటారో చెప్పమన్నాడు. ఒక్కొక్కరు వాళ్లకు వాళ్ళు వేసుకున్న మార్కులు చెప్పగా నాగార్జున ఆడియన్స్ ఇచ్చిన మార్కులు చెప్పాడు..
ముందుగా ప్రియాంక..100 మార్కులు వేసుకోగా ఆమెకు ఆడియన్స్ 71 మార్కులు ఇచ్చారు.
శివాజీ..90 మార్కులు వేసుకోగా ఆడియన్స్ 74 మార్కులు ఇచ్చారు.
దామిని.. 95 మార్కులు వేయగా ఆడియన్స్ ఆమెకు 62 మార్కులు ఇచ్చారు.
ప్రిన్స్..94 మార్కులు వేసుకోగా 69 మార్కులు ఆడియన్స్ ఇచ్చారు.
షకీలా..85 మార్కులు వేసుకోగా 69 మార్కులు వచ్చాయి.
సందీప్..90 మార్కులు వేసుకోగా 72 మార్కులు ఆడియన్స్ ఇచ్చారు.
శోభాశెట్టి..93 మార్కులు వేసుకోగా ఆమెకు 76 మార్కులు వచ్చాయి.
టేస్టీ తేజ.. 100 మార్కులు వేసుకోగా 77 మార్కులు ఆడియన్స్ ఇచ్చారు.
రతిక..90 మార్కులు వేసుకోగా ఆడియన్స్ 80 మార్కులు ఇచ్చారు.
గౌతమ్..100 మార్కులు వేసుకోగా 60 ఆడియన్స్ ఇచ్చారు..
ప్రశాంత్.. 78 మార్కులు వేసుకోగా 74 మార్కులు వచ్చాయి.
శుభశ్రీ..98 మార్కులు వేసుకోగా 65 మార్కులు వచ్చాయి.
కిరణ్ రాథోడ్.. 100 మార్కులు వేసుకోగా 50 మార్కులు ఆడియన్స్ ఇచ్చారు..
చివరగా అమర్ దీప్..97 మార్కులు వేసుకోగా 60 మార్కులు వచ్చాయి..
రతిక రోజ్ ను ఆడియన్స్ గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు.. ఈమెకు గట్టిగానే ఓటింగ్ వేస్తున్నారు.. మొత్తంగా చూసుకుంటే ఈ గ్లామర్ క్వీన్ విన్నర్ అవుతుందని గుసగుసలు మొదలయ్యాయి.. ఇదిలా ఉండగా..పవర్ అస్త్ర అనే టాస్క్ ఇచ్చారు. ఇది సాధిస్తే 5 వారాలు కచ్చితంగా హౌస్ లో ఉంటారు అని నాగ్ ప్రకటించాడు. దీని కోసం అంతా పోటీ పడ్డారు. ఫైనల్ గా ప్రియాంక జైన్, ఆట సందీప్ నిలవగా వీరికి ఒక బాల్స్ గేమ్ పెడితే అందులో సందీప్ గెలిచి పవర్ అస్త్ర గెలుచుకున్నాడు.. సందీప్ ఐదు వారాలు సేఫ్ జోన్ లో ఉంటాడు..