దేశ వ్యాప్తంగా వినాయకుడు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిమజ్జనం చేస్తున్నారు… ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన అంటే గురువారం రోజున వినాయక నిమజ్జనం జరుగుతుంది..అయితే వినాయకుడి విగ్రహాన్ని పెడుతున్న సమయంలో ఎలాంటి నియమాలు పాటించామో అలాగే నిమజ్జనం సమయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..
వినాయకుడి పూజకు ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బొజ్జ గణపయ్యను ఏకదంతా అని, వినాయకుడు అని ఎన్నో పేర్లతో పిలుస్తారు. అలాగే ఏ శుభకార్యానికైనా వినాయకుడినీ ముందుగా పూజిస్తారు. గణపయ్య జన్మదినన్నీ పురస్కరించుకుని వినాయక చవితిని ప్రతి సంవత్సరం పది రోజులపాటు జరుపుకుంటారు. ఆ తర్వాత ఆట పాటలతో, తాళమేళాలతో ఆయనను సాగనంపుతారు.. ముఖ్యంగా చెప్పాలంటే గణపయ్య నిమజ్జనానికి ముందుగా దేవుడినీ ఇష్టంగా పూజించాలి. ఎర్రని పూలు, ఎర్రచందనం, దుర్వ, శెనగ పిండి, తమలపాకు, ధూప దీపం, పాన్ మొదలైన వాటిని వినాయకుడికి సమర్పించాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ వినాయకుడికి హారతినివ్వాలి. అలాగే చతుర్దశి రోజున వినాయకుడు తన ఇంటికి తిరిగి వస్తాడని ప్రజలు నమ్ముతారు.అందుకే వినాయకుడిని ఖాళీ చేతులతో నిమజ్జనం చేయకూడదు..
ఆయన చేతిలో లడ్డును కూడా ఉంచాలి..గణపయ్య నిమజ్జనం సమయంలో పరిశుభ్ర పై శ్రద్ధ ఉంచాలి. నిమజ్జనం సమయంలో మీ మనసులో చెడు ఆలోచనలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నిమజ్జనం రోజున మాంసం జోలికి కానీ, మద్యం జోలికి కానీ అసలు వెళ్ళకూడదు.. ఇకపోతే నలుపు శనికి సంకేతం.. నలుపు రంగు బట్టలను అస్సలు వేసుకోకూడదు.. ఇవన్నీ తప్పక గుర్తుంచుకోవాలి..