Today Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఏ రాశి వారికి ధనలాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12 Zodiac Signs Predictions Today: జీవితంలో ప్రతి రోజూ కొత్త ఆశలు, అనుభవాలతో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో రోజువారీ రాశి ఫలాల ద్వారా ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి అంశాలపై జ్యోతిష్య పరమైన సూచనలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతారు. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు శుక్రవారం (2026 నవంబర్ 6) నాటి ద్వాదశ రాశుల ఫలితాలు, ఆయా రాశుల వారు పాటించాల్సిన దైవారాధన పరిహారాలను భక్తి టీవీ వేదికగా అందించారు.
మేష రాశి:
ఈ రోజు మేష రాశి వారికి వ్యాపార పరంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. వ్యాపార కార్యక్రమాల్లో విశేష లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. మంచివారితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ సుఖసంతోషాలతో గడుపుతారు. ముఖ్యమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఈ రాశి వారు హేరంబ గణపతి స్వామిని జిల్లేడు పుష్పాలతో పూజించడం శుభప్రదం.
Also Read
- Thursday Horoscope: గురువారం రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
- Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
- Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
- Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
వృషభ రాశి:
వృషభ రాశి వారు ఈ రోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఎదురయ్యే సూచనలు ఉండటంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మహాలక్ష్మి అమ్మవారిని స్మరిస్తూ అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
మిథున రాశి:
మిథున రాశి వారికి ప్రయత్నాల ద్వారా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని అధికారిక గౌరవాలు అందుకుంటారు. అయితే రాజకీయ అంశాలకు సంబంధించిన విమర్శలకు దూరంగా ఉండటం మంచిది. మాటతీరు, వ్యవహారశైలిలో సంయమనం పాటించాలి. ఈ రోజు లలితా అమ్మవారి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం శుభఫలితాలను ఇస్తుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ రోజు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. మనసులోని ఆందోళనలను అధిగమిస్తూ ముందుకు సాగాలి. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రయాణ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఖర్చుల విషయంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలి. శ్రీ సత్యనారాయణ స్వామి వారి అష్టకాన్ని పారాయణం చేయడం మంచిది.
సింహ రాశి:
సింహ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ధననష్టాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఎదురయ్యే ఆటంకాలను ధైర్యంగా అధిగమించాలి. శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించడం శుభప్రదదం.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మానసిక ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురైనా ప్రశాంతంగా వ్యవహరించాలి. ముఖ్యంగా మహిళలు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధార్మిక చింతన పెరుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పాలతో పూజించడం మంచిది.
తులా రాశి:
తులా రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతో పాటు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమన్వయంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి వారి స్కందషష్టి కవచాన్ని పారాయణం చేయాలి.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి. స్థానచలన మార్పులు చోటుచేసుకోవడంతో పాటు కుటుంబ సౌకర్యాలు మెరుగుపడతాయి. అయితే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉంటూ, మీ పనులపై దృష్టి పెట్టాలి. ఆంజనేయ స్వామివారికి సింధూరంతో అర్చన చేయడం శుభప్రదం.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ప్రయాణాలు, ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక నష్టాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. అవసరానికి మించి శ్రమించకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మహావిష్ణువు స్తోత్రాన్ని పారాయణం చేయడం శుభఫలితాలను ఇస్తుంది.
మకర రాశి:
మకర రాశి వారు ఈ రోజు అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలి. వ్యాపార వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉంటూ కీలక సమావేశాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారు నాయకులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి విషయంలో సంయమనం పాటించడం మంచిది. కాలభైరవ స్వామి వారి కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయాలి.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి మహిళల ద్వారా మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన కార్యక్రమాలు ఫలించే అవకాశం ఉంది. అయితే అనవసరమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులపై దృష్టి సారించాలి. మహాగౌరీ అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించడం శుభప్రదం.
మీన రాశి:
మీన రాశి వారు ఈ రోజు అనవసర కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. కష్టపడి సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. కోపం, ఆవేశాలకు దూరంగా ఉంటూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి. ఓర్పు, సంయమనంతో వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. మహాగణపతి స్వామివారి గణపతి అష్టకాన్ని పారాయణం చేయడం మంచిది.
తాజావార్తలు
-
Today Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఏ రాశి వారికి ధనలాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!