రెండవ రోజు కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఏర్పేడు వ్యాసాశ్రమం శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారు చేసిన అనుగ్రహభాషణం, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు భక్తులందరినీ చరితార్థులను చేసింది.

భారతదేశంలో మనం జన్మించడం ఒక వరమైతే, భక్తులుగా ఉండటం ఇంకొక వరమనీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరొక వరమనీ.. ఈ మూడు దేవుడు మనకు ఇచ్చిన వరాలని కోటి దీపోత్సవ ప్రాముఖ్యతను కొనియాడారు.

రెండవ రోజు కార్యక్రమాల తర్వాత ఎన్టీవీ, భక్తి టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారిని గౌరవ గురువందనం చేశారు.

