మూడవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి, శ్రీ శివ స్వామి, శ్రీ సర్వవిదానంద సరస్వతి స్వామి వార్లు భక్తులను ఉద్ధేశించి కార్తిక మాసం గురించి, దాని ప్రాముఖ్యతను, కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి గురించి ప్రస్తావిస్తూ అనుగ్రహ భాషణం చేయగా.
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ భారతీయ సంస్కృతిలో దీపం యొక్క ప్రాముఖ్యత, కార్తీక మాస దీప ప్రాధాన్యం, కార్తిక పూర్ణిమ గురించి వివరిస్తూ, ప్రతీయేటా కోటి దీపోత్సవం నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరిని అభినందిస్తూ ప్రవచనామృతం చేశారు.

వీరితో పాటు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, శ్రీ బీజేపీ నాయకులు బండి సంజయ్, హైదరాబాద్ సీపీ శ్రీ అంజనీ కుమార్ ఐపీఎస్ ,కూడా మూడవ రోజు కోటి దీపోత్సవానికి హాజరయ్యారు.



ఇవి కాక వేదిక మీద సింహాద్రి అప్పన్న హరిచందన పూజ, భక్తులతో శివలింగాలకు ప్రత్యేక అష్టోత్తర శత నామార్చన, సింహాద్రి అప్పన్న కల్యాణం, కల్ప వృక్ష వాహన సేవ జరిగాయి.

వీటితో పాటు రోజూ జరిగే జ్యోతి ప్రజ్వలన, బంగారు లింగోద్భవం, మహా నీరాజనం, గురు వందనం, సప్త హారతి వంటి కార్యక్రమాలు జరిగాయి.

