దేవీ నవరాత్రులు చివరి రోజున అమ్మవారు రెండు అలంకారాలలో దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్దనీ దేవిగా మధ్యాహ్నం శ్రీ పెద్దమ్మ తల్లిగా అమ్మవారు కనిపిస్తారు.. నవమి తిథి ఉదయం వరకు మాత్రమే ఉండటం.. మధ్యాహ్నం దశమి తిథి ప్రారంభమవుతుండటంతో ఈరోజు అమ్మవారు రెండు అవతారాల్లో దర్శనం ఇవ్వనున్నారు.. ఉదయం, మధ్యాహ్నం లలో భక్తులకు అమ్మవారు రెండు అవతారాల్లో దర్శం ఇస్తున్నారు..
ఈ నవరాత్రుల్లో అమ్మవారి అత్యంత ఉగ్రరూపం మహిషాసురమర్దనీ దేవి. ఈరోజు ఎరుపురంగు చీరలో దర్శనం ఇస్తారు. ఈరోజున అమ్మ దుష్ట శిక్షణ, శిష్ణ రక్షణ చేసింది. సింహ వాహనం అధిష్టించి ఆయుధములు ధరించి అమ్మ మహా శక్తి రూపంలో ఈరోజు దర్శనం ఇస్తుంది. ఈరోజు అమ్మవారిని పూజిస్తే శత్రు భయాలు తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయి. అంతేకాదు ఈ రోజు అమ్మవారిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము కలుగుతుంది. చండీ సప్తశతి, హోమము చేస్తే మంచిది. చిత్రాన్నము, గారెలు, వడపప్పు, పానకము నైవేద్యం పెట్టాలి.
శరన్నవరాత్రుల్లో చివరి అలంకారము ఇదే అందుకే రెండు అలంకరణ లో అమ్మ దర్శనం ఇవ్వబోతున్నారు.. బంగారు రంగుర చీరలో దర్శనం ఇస్తారు. ఇచ్ఛా, ఙ్ఞాన, క్రియ శక్తులను ఈ మూర్తి భక్తులకు వరంగా అందిస్తుంది. అమ్మవారిని పూజించి లలితా సహస్ర నామ పారాయణ చేస్తే మంచిది. కుంకుమార్చనలు, సువాసినీ పూజలు చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. లడ్డూలు నివేదన చేయాలి.. చివరగా జమ్మి చెట్టుకు పూజలు చెయ్యాలి.. రేపు విజయదశమి కాబట్టి అమ్మవారిని నైవేద్యాలతో, ప్రత్యేకంగా పూజలు చెయ్యడం వల్ల చాలా మంచిది..