దేవీ నవరాత్రులు చివరి రోజున అమ్మవారు రెండు అలంకారాలలో దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్దనీ దేవిగా మధ్యాహ్నం శ్రీ పెద్దమ్మ తల్లిగా అమ్మవారు కనిపిస్తారు.. నవమి తిథి ఉదయం వరకు మాత్రమే ఉండటం.. మధ్యాహ్నం దశమి తిథి ప్రారంభమవుతుండటంతో ఈరోజు అమ్మవారు రెండు అవతారాల్లో దర్శనం ఇవ్వనున్నారు.. ఉదయం, మధ్యాహ్నం లలో భక్తులకు అమ్మవారు రెండు అవతారాల్లో దర్శం ఇస్తున్నారు.. ఈ నవరాత్రుల్లో అమ్మవారి అత్యంత ఉగ్రరూపం మహిషాసురమర్దనీ దేవి. ఈరోజు ఎరుపురంగు చీరలో దర్శనం ఇస్తారు.…