Koti Deepotsavam 2024 Day 15: ఇల కైలాసంలో.. శ్రీసీతారాముల కల్యాణోత్సవం
- 15వ రోజు ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవం
- ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి,
- దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ,
- దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్న భక్తులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ 15వ రోజు ఘనంగా ముగిసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు. అంతేకాకుండా.. దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. పిల్లా, పెద్ద అని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని 15వ రోజు విజయవంతం చేశారు. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో పాల్గొని పునీతులవుతున్నారు. మరోవైపు.. శనివారం జరిగిన కోటిదీపోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై.. విశేష కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. జానకిరాముల వైభవం, కొండగట్టు అంజన్నకు కోటితమలపాకుల అర్చన, శ్రీసీతారాముల కల్యాణోత్సవం వేదికపై ఉండి వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీతారాముల కల్యాణంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. 13 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోనే ముఖ్యమైన వ్యక్తులు పాల్గొనడం.. ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం సంతోషంగా ఉందని మంత్రులు చెప్పారు.

Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
- Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
- Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
- Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
15వ రోజు కోటి దీపోత్సవంలో భాగంగా.. శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ (పెజావర్ మఠాధిపతి, ఉడుపి), శ్రీ మాధవానంద భారతి మహాస్వామీజీ (శ్రీమన్నెలేమావుమఠం శ్రీసంస్థానం, కర్ణాటక)లు అనుగ్రహ భాషణం చేశారు. బ్రహ్మశ్రీ డా.కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ప్రవచనామృతం వినిపించారు. అలాగే.. వేదికపై కోటి తమలపాకుల అర్చన, అయోధ్య బాలరాముని మహాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులచే ఆంజనేయ విగ్రహాలకు కోటితమలపాకుల అర్చన చేయించారు. అలాగే.. ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరిపించారు. హనుమంత వాహన సేవ కూడా చేశారు. చివరలో సప్త హారతి, లింగోద్భవం, పరమేశ్వరుడికి మహానీరాజనం కార్యక్రమంతో 15వ రోజు కోటి దీపోత్సవం వేడుక విజయవంతంగా ముగిసింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!