Koti Deepotsavam 2024: దిగ్విజయంగా ముగిసిన కోటి దీపోత్సవం.. 17 రోజుల పాటు సాగిన మహా క్రతువు..
- దిగ్విజయంగా ముగిసిన కోటి దీపోత్సవం..
- నవంబర్ 9 నుంచి 25 వరకు దీపాల పండగ..
- 17 రోజుల పాటు దిగ్విజయంగా సాగిన కోటి దీపాల సంబురం..
- విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి ముర్ము ..
- రెండు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఆశేష జనవాహిని..
- మహా మంగళ హారతి దర్శనంతో వేడుకలు సమాప్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2024: ప్రతీ ఏడాది కార్తిక మాసంలో భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దిగ్విజయంగా ముగిసింది.. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన ఈ మహా దీపయజ్ఞం 17 రోజుల పాటు కొనసాగాయి.. ఈ నెల 25వ తేదీన అంటే.. కార్తిక చివరి సోమవారం రోజు ముగిసింది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 17రోజులపాటు జరిగిన మహాసంబరం ఆసేతు హిమాచలాన్ని ఆకట్టుకుంది. నభూతో నా భవిష్యత్ అనే తీరులో సాగిన కార్యక్రమానికి భారత దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము.. పలు రాష్ట్రాల గవర్నర్‌లు.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్ , కిషన్ రెడ్డి.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొంగులేటి, తుమ్మల సహా.. హైకోర్టులో న్యాయమూర్తులు.. ఇతర ప్రముఖులు హాజరై ఈ దీపయజ్ఞంలో భాగస్వాములు అయ్యారు.. దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందని ప్రశంసలు కురిపించారు..
Read Also: CM Revanth: నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ భేటీ..
Also Read
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
- Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
ఏటికేడు దైదీప్యమానంగా ఈ మహా సంబరం వెలిగిపోతుంది. గతేడాది ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొనగా, ఈ ఏడాది దేశానికి ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము విచ్చేసారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి కోటి దీపోత్సవంలో పూరీ జగన్నాథునికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలి కార్తీక దీపాన్ని రాష్ట్రపతి వెలిగించారు. ఇల కైలాసంలో కార్తికమాసం వేళ భక్తి, ఎన్టీవీ చేపుడుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మికను మరింత ముందుకు తీసుకువెళ్తుందుని పీఠాధిపతులు, స్వామిజీలు వేనోళ్ల కొనియాడారు. నవంబర్ 9న ఆరంభమైన దీపాల పండుగ.. నవంబర్ 25 వరకు అప్రతిహాతంగా సాగింది. 17రోజులపాటు సాగిన ఈ మహా క్రతువుకు హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆశేష జనవాహిని పాల్గొంది. ప్రతీ రోజు ప్రత్యేక అలంకారాలు.. కోటిదీపోత్సవం దేవికగా దేవానదేవతులు కల్యాణాలు.. రోజుకో పల్లకి సేవా.. ప్రతీ రోజు ఓ విశిష్ట అతిథి.. పీఠాధిపతులు.. మఠాధిపతుల ప్రవచనాలు.. ఇలా 17 రోజుల పాటు భక్తులు పరవశింపజేశాయి.. శివనామస్మరణతో మార్మోగిన ఎన్టీఆర్ స్టేడియం పరిసరాలు.. భక్తజన సంద్రంగా మారిపోయాయి.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపి.. భక్తులను తరలించేందుకు తోడ్పాటును అందించింది.. చివరి రోజు మహా మంగళ హారతి దర్శనంతో కోటి దీపోత్సవ వేడుకలు ముగిశాయి. ఈ కోటి దీపయజ్ఞం దిగ్విజయం కాకడానికి కృషి చేసిన అందరికీ.. భక్త జనానికి భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ ధన్యవాదాలు తెలుపుతోంది..
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!