Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
- నవంబర్ 24న కార్తీక పౌర్ణమి
- సాయంత్రం 5:25 నుంచి అర్ఘ్య సమయం
- చంద్రుడికి నీళ్లు, పాలతో అర్ఘ్యం
- చంద్రారాధనతో మనశ్శాంతి కలుగుతుందని విశ్వాసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూ ధర్మంలో కార్తీక పౌర్ణమికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణుమూర్తి, శివుడు, అలాగే చంద్రుడిని పూజించడం ఎంతో విశేషంగా భావిస్తారు. పౌర్ణమి వేళ స్నానం, దానాలు, పూజలు చేస్తే పుణ్యం దక్కుతుందని, చంద్రుడికి అర్ఘ్యం ఇస్తే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. 2026లో కార్తీక పౌర్ణమిని నవంబర్ 24, మంగళవారం జరుపుకుంటారు. నవంబర్ 23 రాత్రి 11:42 గంటలకు ప్రారంభమయ్యే పౌర్ణమి తిథి, నవంబర్ 24 రాత్రి 8:23 గంటల వరకు ఉంటుంది. దీనిని దేవతల దీపావళి అని కూడా అంటారు.
పురాణ ప్రాధాన్యత.. విశేషాలు ఇవే
మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజే శివుడు త్రిపురాసురుడిని సంహరించారు. ఈ సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం, దీపాలు పెట్టడం, అన్నదానం, వస్త్రదానం చేయడం ఎంతో మంచిది. విష్ణుమూర్తి మత్స్యావతారం, తులసి అవతారంతో పాటు సిక్కు గురువు గురు నానక్ దేవ్ జీ జయంతితోనూ ఈ రోజుకు సంబంధం ఉంది. అలాగే ప్రసిద్ధ పుష్కర్ మేళా కూడా ఈ రోజుతో ముగుస్తుంది.
Also Read
- December 2026 Sun Transit: డిసెంబర్లో సూర్యుడి నక్షత్ర మార్పు.. ఏ రాశులకు డబ్బు, అదృష్టం.?
- Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
- Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
- Koti Deepotsavam 2026 Day 9: కోటి దీప యజ్ఞంలో నేడు మరో విశేష ఘట్టం.. కంచి కామాక్షి మహాభిషేకం, మీనాక్షి కల్యాణం!
అర్ఘ్యం సమర్పించే టైమ్.. లాభాలు
క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న సాయంత్రం 4:56 గంటలకు చంద్రోదయం, సాయంత్రం 5:24 గంటలకు సూర్యాస్తమయం అవుతాయి. సూర్యాస్తమయం తర్వాత చంద్రుడికి నీళ్లు సమర్పించడం మంచిదని, ఆ రోజు సాయంత్రం 5:25 నుంచి రాత్రి 8 గంటల మధ్య అర్ఘ్యం ఇవ్వొచ్చని చెబుతున్నారు. పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తి కళలతో ఉంటాడు కాబట్టి అర్ఘ్యం సమర్పించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, చంచలత్వం, ఒత్తిడి తగ్గుతాయి. జాతకంలో చంద్ర దోషం ప్రభావం తగ్గుతుందని, కొన్ని నమ్మకాల ప్రకారం రాహు కేతు దోషాల ఎఫెక్ట్ కూడా తగ్గుతుందని అంటారు. కుటుంబంలో ప్రేమ, సంతోషం పెరిగి, ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఊరట లభిస్తుందని, చంద్రుడి వెలుగులో గడపడం వల్ల పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందని విశ్వాసం.
అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే?
చంద్రోదయం అయ్యాక స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఒక పాత్రలో మంచి నీళ్లు తీసుకుని అందులో కొంచెం పచ్చి పాలు, పచ్చి బియ్యం, పంచదార లేదా తెల్ల పువ్వులు వేసుకోవచ్చు. చంద్రుడి వైపు తిరిగి సన్నని నీటి ధారను వదులుతూ ఓం సోమాయ నమః లేదా ఓం సో సోమాయ నమః మంత్రాన్ని జపించాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు నీళ్లు పాదాలపై పడకుండా జాగ్రత్త పడాలి. చివరగా మనశ్శాంతి, ఆనందం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించాలి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
-
TDP : ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్పర్సన్ల జాబితా విడుదల..
-
December 2026 Sun Transit: డిసెంబర్లో సూర్యుడి నక్షత్ర మార్పు.. ఏ రాశులకు డబ్బు, అదృష్టం.?
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!