కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చెయ్యడం వల్ల ముక్తి తో పాటుగా అనేక లాభాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.. నెల రోజులు కార్తీక స్నానాలు చేయడం వలన మనలో బద్దకం పోతుంది. సాధారణంగా స్నానం చేయడం వలన మనం శుభ్రంగా ఉంటాము. అయితే మనం స్నానం చేసే సమయం, విధానం వలన కూడా ప్రత్యేకత అనేది ఉంటుందని చెబుతున్నారు.. కార్తీక మాసంలో చేసే స్నానాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అయితే బ్రహ్మ ముహూర్తంలో కాలువలు, చెరువులు లేదా బావుల లోని నీటితో చన్నీటి స్నానం చేస్తే మంచిది అంటారు. ఈ విధంగా కార్తీక మాసంలో స్నానాలు చేయడం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందుతారు. కార్తీకమాసం రాగానే చలికాలం కూడా మొదలవుతుంది. అయితే ఈ చలిలో చాలామందికి బద్దకంగా ఉండి ఎక్కువసేపు నిద్ర పోవాలని అనిపిస్తుంది.. ఉదయాన్నే లేచి స్నానం చెయ్యడం వల్ల నిద్ర మత్తు పోయి చాలా యాక్టివ్ గా ఉంటారని చెబుతున్నారు..
కార్తీకమాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు కావున వేడి తక్కువగా ఉంటుంది.. సమయానికి వర్షాలు తగ్గి నదులు, కాలువల్లో నీటి ఉదృతి తగ్గి నీటిలో మలినాలు అడుగుకు చేరుకొని నీరు స్వచ్ఛముగా తయారవుతాయి. ఈ నీటిలో ఉండే ఔషధాలు కూడా మనలో ఉండే ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అందుకే ఈ నీళ్లతో స్నానం చేస్తే ఆధ్యాత్మికంగా నే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. అందుకే మన పెద్దలు కార్తీక మాసంలో నదుల వద్ద, సముద్రాల వద్దకు వెళ్లి పుణ్య స్నానాలు చేస్తారు.. ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఇలా స్నానం చేసి శివయ్యను పూజిస్తారు..