Bhishma Ekadashi: నేడు భీష్మ ఏకాదశి.. మీ కష్టాలు తీరాలంటే ఇలా చేయండి!
- నేడు భీష్మ ఏకాదశి
- ఈ రోజు విష్ణు సహస్రనామాలని చదివితే మేలైన ఫలితం
- విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా, విన్నా మోక్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సంస్కృతిలో పండగలు, మాసాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో భక్తులు పూజలు, ఉపవాసాలు చేస్తుంటారు. తమ జీవితాల్లో కష్టాలు తొలగి సుఖశాంతులు కలగాలని కోరుకుంటు ఉంటారు. కాగా నేడు (ఫిబ్రవరి08) భీష్మ ఏకాదశి. మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ప్రతీ ఏటా మాఘ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. శ్రీ విష్ణు సహస్రనామాన్ని భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. ఈ రోజు విష్ణు సహస్రనామాలని చదివితే మేలైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
కార్తీక మాసం, శ్రావణ మాసాల్లాగే, మాఘ మాసం కూడా ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో పవిత్రమైన నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే ఆపదలు తొలుగుతాయని చెబుతుంటారు. పూజలు, ఉపవాసాలు చేయడం ద్వారా భాదల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని చెబుతుంటారు. పురాణాల ప్రకారం విష్ణు సహస్రనామ పారాయణం చాలా విశిష్టమైనది. భీష్మ ఏకాదశి నాడు ఈ విష్ణు సహస్రనామాలను పఠిస్తే శుభాలు కలుగుతాయి. స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుందని విశ్వసిస్తుంటారు.
Also Read
- Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. కలిసి రానున్న ఆర్థిక లావాదేవీలు!
- Today Astrology: సోమవారం దిన ఫలాలు.. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్త సుమీ!
- IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
- Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
ముఖ్యంగా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా, విన్నా మోక్షం కలుగుతుంది. ఈ రోజు గోవులను పూజిస్తే మంచి ఫలితాలను అందుకోవచ్చు. లక్ష్మీనరసింహ స్వామికి పసుపు రంగుతో కూడిన ఫలాలను సమర్పిస్తే శుభాలు కలుగుతాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా తల స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించి శ్రీ మహా విష్ణువును ఆరాధించాలి. ఉపవాసం, జాగరణ చేయాలి. ఇలా చేస్తే మీ కష్టాలు తీరి.. సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చూకూరుతాయని పండితులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Palak Pakoda Recipe: సింపుల్‌గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
-
West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్‌లో తీవ్ర సంక్షోభం..
-
Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
-
Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
-
YS Jagan: అందుకే “మావిగన్” ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!