భారతీయ సంస్కృతిలో పండగలు, మాసాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో భక్తులు పూజలు, ఉపవాసాలు చేస్తుంటారు. తమ జీవితాల్లో కష్టాలు తొలగి సుఖశాంతులు కలగాలని కోరుకుంటు ఉంటారు. కాగా నేడు (ఫిబ్రవరి08) భీష్మ ఏకాదశి. మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ప్రతీ ఏటా మాఘ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. శ్రీ విష్ణు సహస్రనామాన్ని భీష్మపితామహుడు పాండవులకు…