Good Friday: ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు.. గుడ్ ఫ్రైడే ఎందుకు ‘‘గుడ్’’..
- ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే..
- క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైన రోజు..
- క్రీస్తుకు శిలువ వేసిన రోజును ఎందుకు ‘‘గుడ్ ఫ్రైడే’’గా పిలుస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good Friday: క్రైస్తవులకు ఎంతో శుభకరమైన రోజు ‘‘గుడ్ ఫ్రైడే’’ ఈ ఏడాది ఏప్రిల్ 3న వస్తోంది. క్రైస్తవులు దీనిని ఒక ప్రత్యేకమైన, శోకదినంగా పాటిస్తారు. ఇదే రోజున ఏసు క్రీస్తుకు శిలువ వేసినట్లు నమ్ముతారు. ఈ రోజున క్రైస్తవులు చర్చ్లకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. చాలా మంది ఉపవాసం పాటిస్తారు. కొందరు మౌనంగా ఉంటూ తమ భక్తిని ప్రదర్శిస్తారు. అయితే, ఏసు క్రీస్తును హింసించి, శిలువ వేసిన ఈ రోజును ‘‘గుడ్ ఫ్రైడే’’గా ఎందుకు జరుపుకుంటారు. ఒక విషాద దినాన్ని ఎందుకు ‘‘గుడ్’’గా పేర్కొంటారనే సందేహం వస్తుంది.
అనేక కారణాలు:
Also Read
- Sri Hari Stotram: తొలి ఏకాదశి వేళ భక్తి టీవీలో అమృతతుల్యమైన "శ్రీహరి స్తోత్రం".. తప్పక వినండి!
- Saturday Horoscope: నేడు ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే.!
- Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే
- Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
గుడ్ ఫ్రైడేకు అనేక కారణాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారం.. మనిషి చనిపోయిన రోజు పుట్టిన రోజు కన్నా పవిత్రమైందిగా భావించబడతుంది. ఈ రోజు ఏసు క్రీస్తు త్యాగం చేసిన పవిత్రమైనన రోజుగా భావిస్తారు, అందుకే దీనిని ‘‘గుడ్’’గా వ్యవహరిస్తారు. గుడ్ అనే పదానికి పూర్వకాలం ‘‘పవిత్రమైన’’ అనే అర్థం కూడా ఉండేది. అందుకే దీనిని ‘‘హోలీ ఫ్రైడే’’ అని కూడా పిలిచేవారు. కొన్ని ప్రాంతాల్లో దీనిని ‘‘బ్లాక్ ఫ్రైడే’’ లేదా ‘‘గ్రేట్ ఫ్రైడే’’గా కూడా పిలుస్తారు.
ఏసుకు ఎందుకు శిలువ వేశారు:
సుమారు 2000 ఏళ్ల క్రితం, ఏసు క్రీస్తు ప్రజలకు అహింస, ప్రేమ, కరుణ, ఐక్యత, మానవత్వ వంటి విలువల్ని బోధించారు. ఆయన ఉపదేశాలకు ప్రజలు ఆకర్షితులై ఆయనను దేవుడిగా, దేవుడి కుమారుడిగా ఆరాధించడం మొదలుపెట్టారు. క్రమంగా ఏసుకు పెరుగుతున్న ఆదరణ చూసిన మత గురువులు ఆయనపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈ మతనాయకులంతా కుట్ర పన్ని, అప్పటి రోమన్ పాలకుడికి ఏసు గురించి లేనిపోని అబద్ధాలు చెప్పారు. క్రీస్తు తాను దేవుని కుమారుడనని చెప్పుకుంటున్నాడని, ఆయన మాటలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. దీంతో ఏసు క్రీస్తుపై దేశ ద్రోహం అభియోగాలు మోపి, వేలాది మంది ప్రజల సమక్షంలో ఆయన శరీరాన్ని శిలువ వేశారు. ఆయనకు ముళ్ల కిరీటాన్ని పెట్టి, కొరడాలతో కొడుతూ శిలువ వద్దకు తీసుకెళ్లి, ఆయన కాళ్లు చేతులకు మేకులు కొట్టి శిలువకు వేలాడదీశారు.
తాజావార్తలు
-
Mohan Bhagwat: “నేటి తరం దారి తప్పలేదు”.. సీజేపీ నిరసనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
-
Samsung Galaxy F70 Pro: సామ్ సంగ్ గెలాక్సీ F70 ప్రో.. 6000mAh బ్యాటరీ, Snapdragon 6 Gen 3 చిప్సెట్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా?.. కేంద్రానికి CJP డెడ్లైన్.. ఢిల్లీలో హై అలర్ట్!
-
Viswanath And Sons: సూర్య సినిమాకు జ్యోతిక టచ్.. రిలీజ్ తర్వాతే ఆ సీక్రెట్ రివీల్!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!