Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మొదట ఆశ్చర్యపోయే విషయం దాని నిర్మాణం. సాధారణంగా ఆలయాలను రాయి రాయిగా పేర్చి నిర్మిస్తారు. కానీ మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాసనాథ ఆలయాన్ని మాత్రం ఒకే భారీ కొండరాయిని పై నుంచి కిందికి చెక్కి రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఆలయాల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. అందుకే దీనిని భారతీయ శిల్పకళలో అత్యంత గొప్ప అద్భుతాల్లో ఒకటిగా భావిస్తారు.
చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయాన్ని రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడు ఎనిమిదో శతాబ్దంలో నిర్మించించాడు. శివుడి కైలాస పర్వతాన్ని భూమిపై ప్రతిబింబించేలా ఈ ఆలయాన్ని రూపొందించినట్లు భావిస్తారు. ఆలయ నిర్మాణంలో ముందుగా కొండపై భాగాన్ని గుర్తించి అక్కడి నుంచి క్రమంగా రాయిని తొలగిస్తూ కిందివైపు చెక్కారు. ఈ విధానం వల్ల నిర్మాణంలో పొరపాట్లకు చాలా తక్కువ అవకాశం ఉండేది. ఒకసారి రాయిని తొలగిస్తే తిరిగి అమర్చడం సాధ్యం కాకపోవడంతో ప్రతి అడుగులోనూ అత్యంత ఖచ్చితత్వం అవసరమైంది.
Also Read
- Spiritual: రావణుడు ప్రతిష్ఠించిన శివాలయాలు ఇవే.. వాటి వెనుక ఉన్న పురాణ రహస్యాలు తెలుసా?
- Kitchen Vastu Tips: మీ వంటగదిలో విరిగిన చపాతీ పీట ఉందా? బాబోయ్ జాగ్రత్త! ఎందుకో తెలుసా
- Vastu Mistakes: ఎంత సంపాదించినా పైసా మిగలట్లేదా? మీ బాత్రూమ్లోని ఈ 3 తప్పులే దానికి కారణం! అవి ఏంటో తెలుసా
- Shravana Maasam: శ్రావణ మాస మహోత్సవం.. జూలై 30నా లేక 31నా? శివయ్య భక్తులు నోట్ చేసుకోవాల్సిన పవిత్ర తిథులు ఇవే!
ఈ ఆలయంలో గర్భగుడి, మండపాలు, శిల్పాలు, స్తంభాలు, ఏనుగుల విగ్రహాలు అన్నీ ఒకే రాతిలో నుంచి చెక్కబడ్డాయి. పరిశోధకుల అంచనా ప్రకారం లక్షల టన్నుల రాయిని తొలగించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆధునిక యంత్రాలు లేని కాలంలో ఇంత భారీ నిర్మాణాన్ని ఎలా పూర్తి చేశారన్నది ఇప్పటికీ ఇంజినీర్లను ఆశ్చర్యపరుస్తోంది.
ఎల్లోరా గుహలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించి భారతీయ శిల్పుల ప్రతిభను ప్రత్యక్షంగా చూస్తుంటారు. కైలాసనాథ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, భారతీయ ఇంజినీరింగ్ నైపుణ్యం, కళాత్మకత, దూరదృష్టికి చిరస్థాయి గుర్తుగా నిలిచింది.
తాజావార్తలు
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
-
Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
-
INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్‌కు మరో మైలురాయి
ట్రెండింగ్
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!