Shravana Maasam: శ్రావణ మాస మహోత్సవం.. జూలై 30నా లేక 31నా? శివయ్య భక్తులు నోట్ చేసుకోవాల్సిన పవిత్ర తిథులు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shravana Maasam: హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం ఐదవ నెల. ఈ మాసం శివ భక్తులకు అత్యంత పవిత్రమైనది. ఈ నెల మొత్తం పరమశివుడి ఆరాధనకు అంకితం చేస్తారు. భోళాశంకరుడికి శ్రావణ మాసం అంటే ఎంతో ప్రీతిపాత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలంలో చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాల వల్ల విశేష ఫలితాలు దక్కుతాయని, స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. హిందూ గ్రంథాల ప్రకారం.. శ్రావణ మాసంలో సృష్టి నిర్వహణ బాధ్యతలను శివుడే స్వయంగా చూసుకుంటూ, తనను కొలిచే భక్తులపై కరుణాకటాక్షాలను కురిపిస్తాడట.
సముద్ర మథనం.. హలాహల భక్షణం
శ్రావణ మాసానికి, పురాణాల్లోని సముద్ర మథన ఘట్టానికి అత్యంత విడదీయరాని సంబంధం ఉంది. దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మథించింది ఈ మాసంలోనే అని చెబుతారు. అయితే ఆ మథనంలో అమృతం కంటే ముందు విశ్వాన్ని నాశనం చేయగల అత్యంత ప్రమాదకరమైన ‘హలాహలం’ అనే విషం ఉద్భవించింది. ఆ సమయంలో సృష్టిని కాపాడటం కోసం పరమశివుడు ఆ విషాన్ని మింగి, తన కంఠంలోనే బంధించి ‘నీలకంఠుడు’ అయ్యాడు. లోకాన్ని రక్షించిన ఆ మహాదేవుడి కృతజ్ఞతగా శ్రావణ మాసంలో శివారాధన చేయడం ప్రత్యేకంగా మారింది. అందుకే ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి.
Also Read
- Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
శ్రావణ సోమవారాలు.. సోమవార వ్రత మహాత్మ్యం
శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలకు ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజులను భక్తులు శివస్వరూపంగా భావిస్తారు. సోమవారాల్లో ఉపవాస దీక్షలు చేపట్టి, శివాలయాలకు వెళ్లి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు ఎంతో మహిమాన్వితమైన ‘షోడశ సోమవార వ్రతాన్ని’ (16 సోమవారాల వ్రతం) ప్రారంభించడానికి శ్రావణ మాస మొదటి సోమవారం అత్యంత ప్రశస్తమైన తిథిగా భక్తులు విశ్వసిస్తారు. శ్రావణ మాసంలోని అన్ని మంగళవారాలు పార్వతీ దేవిని పూజిస్తారు. మంగళవారం రోజున ఉపవాసం ఉండటాన్ని మంగళ గౌరీ వ్రతం అంటారు. అంతేకాకుండా శ్రావణ మాసంలో శ్రావణ శివరాత్రి, హరియాళి అమావాస్య వంటి పవిత్రమైన పండుగలను కూడా జరుపుకుంటారు.
శ్రావణ మాసం తేదీలు
పంచాంగం ప్రకారం.. ఈసారి శ్రావణ మాసం జూలై 30న ప్రారంభమై ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమితో ముగుస్తుంది.
మొదటి శ్రావణ సోమవారం – 3 ఆగస్టు 2026
రెండవ శ్రావణ సోమవారం – 10 ఆగస్టు 2026
మూడవ శ్రావణ సోమవారం – 17 ఆగస్టు 2026
నాల్గవ శ్రావణ సోమవారం – 24 ఆగస్టు 2025
భారతదేశం పౌర్ణమి – అమావాస్య అనే రెండు చాంద్రమాస క్యాలెండర్లను అనుసరిస్తున్నందున, శ్రావణ మాసం వివిధ ప్రాంతాలలో వేర్వేరు తేదీలలో ప్రారంభమవుతుంది. ఈ రెండు క్యాలెండర్ల మధ్య సుమారు 15 రోజుల వ్యత్యాసం ఉంది. ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాలు పౌర్ణమి క్యాలెండర్‌ను అనుసరిస్తుండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు అమావాస్య క్యాలెండర్‌ను అనుసరిస్తాయి. ఈ కారణంగానే శ్రావణ సోమవారాల తేదీలలో వ్యత్యాసం ఉంటుంది. అమావాస్య క్యాలెండర్‌ను అనుసరించే రాష్ట్రాలలో 2026లో శ్రావణ మాసం ఆగస్టు 13న ప్రారంభమవుతుంది.
మొదటి శ్రావణ సోమవారం – 17 ఆగస్టు 2026
రెండవ శ్రావణ సోమవారం – 24 ఆగస్టు 2026
మూడవ శ్రావణ సోమవారం – 31 ఆగస్టు 2026
నాల్గవ శ్రావణ సోమవారం – 7 సెప్టెంబర్ 2026
శ్రావణ మాసంలో శివుడిని ఎలా పూజించాలంటే..
* ముందుగా, గంగాజలం, పాలు, నీటితో శివలింగానికి అభిషేకం చేయండి.
* దీని తరువాత మరొకసారి శుభ్రమైన నీటితో అభిషేకం చేయండి.
* తర్వాత శివునికి 11 లేదా 21 బిల్వ పత్రాలను సమర్పించండి.
* ఆ తరువాత, శివలింగానికి ఉమ్మెత్త, భాంగ్, పువ్వులు, గోధుమలు, తేనె, చందనం, మిఠాయిలను సమర్పించండి.
* పూజ సమయంలో, ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపిస్తూ, భక్తితో శివుని 108 నామాలను స్మరించండి.
* తరువాత స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించి, అగరబత్తీలను కాల్చండి.
* ఆ తర్వాత శివ చాలీసా, రుద్రాష్టకాన్ని పఠించండి.
* చివరగా శివపార్వతులకు హారతి ఇవ్వండి.
తాజావార్తలు
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!