Vastu Mistakes: ఎంత సంపాదించినా పైసా మిగలట్లేదా? మీ బాత్రూమ్లోని ఈ 3 తప్పులే దానికి కారణం! అవి ఏంటో తెలుసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vastu Mistakes: ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో పైసా మిగలడం లేదా? రాత్రింబవళ్లు చెమటోడ్చి సంపాదిస్తున్నా.. నెల ఆఖరికి వచ్చేసరికి బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా అవుతోందా? అయితే దీనికి మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలే ప్రధాన కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లోని బాత్రూమ్ అనేది రాహువు, కేతువు, చంద్రుని శక్తులతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ మనం తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు భయంకరమైన వాస్తు దోషాలకు దారితీస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి, ఆ ఇల్లు దరిద్రంలోకి నెట్టబడుతుందట.
కడు దరిద్రాన్ని తెచ్చిపెట్టే 3 ఘోర తప్పిదాలు ఇవే..
1. ఖాళీ బకెట్లు లేదా టబ్‌లు ఉంచడం:
బాత్రూమ్లో బకెట్లను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు ప్రకారం ఖాళీ బకెట్ అనేది ఇంట్లో ఆర్థిక సంక్షోభానికి, వెలితికి సంకేతం. దీనివల్ల జలాధిపతి అయిన వరుణ దేవుడు, మనస్సుకు – ధనానికి కారకుడైన చంద్రుని దోషం చుట్టుముడుతుంది. దీంతో మీకు డబ్బు రావడం నిలిచిపోతుంది.
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
2. ట్యాప్ నుంచి నీరు లీక్ అవ్వడం:
బాత్రూమ్లో ట్యాప్ పాడైపోయి, దాని నుంచి నిరంతరం నీరు చుక్కలు చుక్కలుగా పడుతుంటే.. దానిని వాస్తు శాస్త్రంలోనే అత్యంత పెద్ద దోషంగా పరిగణిస్తారు. నీరు ఎలాగైతే వృథాగా పోతుందో.. మీ సంపాదన కూడా అలాగే నీళ్లలా కరిగిపోతుందట. ఇది రాహువు యొక్క ప్రతికూల ప్రభావాన్ని పెంచి, అకస్మాత్తుగా భారీ నష్టాలు లేదా ఆసుపత్రి ఖర్చులను తెచ్చిపెడుతుందట.
3. బాత్రూమ్ తలుపులు తెరిచి ఉంచడం:
ఇంట్లో అత్యధికంగా ప్రతికూల శక్తి (నెగటివ్ ఎనర్జీ) ఉద్భవించే ప్రదేశం బాత్రూమ్. చాలామంది బాత్రూమ్ వాడిన తర్వాత బాత్రూమ్ డోర్ తెరిచే ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ఆ నెగటివ్ ఎనర్జీ ఇల్లంతా, ముఖ్యంగా బెడ్రూమ్, కిచెన్ వరకు వ్యాపిస్తుందట. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనశ్శాంతి కరువవ్వడం జరుగుతుందని చెబుతున్నారు.
దీని నుంచి గట్టెక్కించే 4 అద్భుతమైన వాస్తు పరిహారాలు
ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలాంటి దోషాలు ఉంటే భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు. వెంటనే ఈ క్రింది సులభమైన చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు.
* బకెట్ ఎప్పుడూ నిండుగా ఉంచండి: బాత్రూమ్లో కనీసం ఒక్క బకెట్ అయినా ఎప్పుడూ శుభ్రమైన నీటితో నింపి ఉంచండి. ఒకవేళ బకెట్ ఖాళీగా ఉంచాల్సి వస్తే, దానిని బోర్లించి (ఉల్టాగా) పెట్టండి. బాత్రూమ్లో నీలం రంగు (Blue) బకెట్ వాడటం అత్యంత శుభప్రదం.
* లీకేజీలను వెంటనే రిపేర్ చేయించండి: ఇంట్లో ఎక్కడా నీరు వృథా కాకుండా చూసుకోండి. లీకేజీలు ఉన్న నల్లాలను ప్లంబర్‌ను పిలిపించి వెంటనే బాగు చేయించండి.
* గాజు గిన్నెలో రాళ్ల ఉప్పు: బాత్రూమ్లోని నెగటివ్ ఎనర్జీని, రాహు దోషాన్ని తొలగించడానికి ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పు (సముద్రపు ఉప్పు) నింపి బాత్రూమ్ మూలలో ఉంచండి. నెలకు ఒకసారి ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి.
* డోర్ ఎప్పుడూ మూసి ఉంచండి: బాత్రూమ్ ఉపయోగించిన వెంటనే తలుపులు వేసే అలవాటు చేసుకోండి. అలాగే బాత్రూమ్ను ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే గందరగోళం, మురికి ఉన్న చోటే దరిద్రం తాండవిస్తుంది.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..