Sunday Horoscope: 12 రాశుల వారి దిన ఫలాలు ఇవే.. ఆ రాశుల వారికి నేడు లక్కీ ఛాన్స్!

Sunday Horoscope

Sunday Horoscope

Sunday Astrology November 29 2026:వృషభ రాశి వారు తమ శ్రమకు తగిన ప్రతిఫలాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు సమకూరడంతో పాటు కష్టపడి సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సిద్ధివినాయక స్వామి వారి పంచరత్న స్తోత్రం పారాయణం చేయాలి. మిథున రాశి వారు అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. పిల్లల చదువులు, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారి అష్టలక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం మంచిది.

ఈ రోజు వృశ్చిక రాశి వారు సంఘ వ్యవహారాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. అందరినీ కలుపుకుంటూ వెళ్లి కీలక కార్యక్రమాలలో అభివృద్ధి సాధిస్తారు. సానుకూల మార్పులతో వ్యాపారాలు సాగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించి సుబ్రహ్మణ్య స్వామి కవచం పారాయణం చేయాలి. కుంభ రాశి వారు ఇతరులకు హామీలు ఇచ్చే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రావలసిన బాకీలు వసూలవుతాయి. దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు మొదలవుతాయి మరియు పత్రాల విషయంలో అనుకూలతలు పెరుగుతాయి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన నిర్వహించాలి. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఆదివారం రాశి ఫలాలను అందించారు.