Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’ వేడుకకు సీఎం రేవంత్.. స్వామివారికి హారతి
- భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’
- వేడుకకు హాజరైన సీఎం రేవంత్
- స్వామి వారిని దర్శించుకున్న సీఎం
- ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి హారతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్.. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి హారతి సమర్పించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read
నేడు తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం వేదికపై స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన జరిపారు. దీంతో పాటు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీఠం, మైసూరు) అనుగ్రహ భాషణం చేశారు. మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతం వినిపించారు. భక్తులచే మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చన చేయించారు. పల్లకీ వాహన సేవ ఘనంగా నిర్వహించారు.
ఆరవ రోజు విశేష కార్యక్రమాలు:
# పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీఠం, మైసూరు) గారిచే అనుగ్రహ భాషణం
# మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనామృతం
# వేదికపై స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన
# భక్తులచే మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చన
# అగ్నిలింగ క్షేత్రం తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం
# పల్లకీ వాహన సేవ
తాజావార్తలు
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
-
CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!