NTV Telugu Site icon

Electric Scooter: మార్కెట్లోకి మరో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిమీ

Zelio E Bike Mystery

Zelio E Bike Mystery

మరొక హై-స్పీడ్ స్కూటర్ జెలియో ఎబైక్స్ మిస్టరీ (Zelio eBikes Mystery) ఎలక్ట్రిక్ టూ వీలర్ భారత్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్‌ను రూ.81,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. అయితే.. ఈ స్కూటర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో పూర్తి సమాచారం తెలుసుకుందాం..

Budget EV Cars: చౌకైన ఎలక్ట్రిక్ కార్లు(రూ.10 లక్షలలోపు).. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కి.మీ.

పవర్‌ట్రెయిన్
ఈ స్కూటర్ 72V/29AH లిథియం-అయాన్ బ్యాటరీ, 72V మోటారుతో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిమీ పరిధిని, గంటకు 70 కిమీ గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఫుల్ ఛార్జింగ్‌కు 4-5 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 120 కిలోల బరువు ఉండగా.. 180 కిలోల లోడింగ్ కెపాసిటీని కలిగి ఉంది.

డిజైన్
ఈ బైక్ ముందు, వెనుక హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు కలిగి ఉంది. ఇవి రైడర్‌కు మృదువైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. అంతేకాకుండా.. అధునాతన కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ భద్రత, నియంత్రణను పెంచుతుంది. ఇది కాకుండా.. డిజిటల్ డిస్‌ప్లే, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలారం వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్లు అందించారు.

రంగు ఎంపికలు
జెలియో ఎబైక్స్ మిస్టరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బ్లాక్, సీ గ్రీన్, గ్రే, రెడ్.. నాలుగు కలర్ ఆప్షన్‌లతో పరిచయం చేసింది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇందులో రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, USB ఛార్జింగ్, డిజిటల్ డిస్‌ప్లే ఉన్నాయి.

పోటీ
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హై-స్పీడ్ సెగ్మెంట్‌లో Okinawa Okhi 90, TVS iQube, Bajaj Chetak, Ola s1 x, Ampere Magnus EX, Bounce Infinity E1, Hero Electric Optima వంటి ప్రధాన కంపెనీల బైకులతో పోటీపడుతుంది.