Lightyear 0: ప్రపంచంలోనే తొలి సోలార్ కార్..నడుస్తున్నప్పుడే ఛార్జింగ్.. రేంజ్ ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World’s first solar car Light Year 0: ప్రపంచవ్యాప్తంగా కర్భన్ ఉద్గారాలను తగ్గించుకోవాలని అన్ని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో సంప్రదాయ పెట్రోల్, డిజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. ఇప్పటికే టెస్లా వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లతో పాటు ట్రక్కులను తీసుకువచ్చింది. రానున్న రోజుల్లో పూర్తిగా వాహనరంగాన్ని ఎలక్ట్రిక్ వాహనాలే ఏలే అవకాశం ఉంది. దీనికి తగ్గట్లుగానే అన్ని ఆటోమేకింగ్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఇండియాలో టాటాతో పాటు మహీంద్రా, ఎంజీ, హ్యుందాయ్ వంటి ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థలు తమ కార్లను మార్కెట్ లోకి తీసుకువచ్చాయి. ఎలక్ట్రిక్ కార్లలోనే కొత్త టెక్నాలజీని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.
Read Also: Sundar Pichai: గూగుల్ సీఈఓకి పద్మభూషణ్..
Also Read
- Bajaj Pulsar N160 S N160 SS: బజాజ్ కొత్త పల్సర్ N160 S, N160 SS విడుదల.. 4-వాల్వ్ ఇంజన్, ధరలు, ఫీచర్లు ఇవే!
- Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
- E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
ఇదిలా ఉంటే లైట్‌ఇయర్ 0 అనే కంపెనీ కొత్తగా సోలార్ ఎలక్ట్రిక్ కార్ ను తీసుకురాబోతోంది. ఇది ప్రపంచంలోనే తొలి సోలార్ ఎలక్ట్రిక్ కారు. దీన్ని డ్రైవింగ్ చేస్తున్న సమయంలోనే ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అవసరం లేకుండా నెలల తరబడి ప్రయాణించే వీలుంటుంది. కారు రూఫ్, ఇతర భాగాల్లో అమర్చిన సోలార్ ఫ్యానెళ్ల సహాయంతో కార్ రీఛార్జ్ అవుతుంది. కారు ప్రయాణించే సమయంలో సూర్యుడి నుంచి వచ్చే శక్తిని ఆధారంగా చేసుకుని ఛార్జింగ్ చేసుకుంటుంది. ప్రతీ రోజు దాదాపుగా 43 మైళ్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఈ కార్. రూఫ్ పై 50 చదరపు అడుగుల కంటే ఎక్కువ సోలార్ ఫ్యానెళ్లు ఉన్నాయి.
డచ్ స్టార్టప్ కంపెనీకి చెందిన ఎంట్రప్రెన్యూర్ మ్యాగజీన్ ప్రకారం లైట్‌ఇయర్ 0 కారు నాలుగు డోర్లు కలిగిన ఎలక్ట్రిక్ కారు. ప్రపంచంలోనే తొలి సోలార్ కారుగా రికార్డు సృష్టించనుంది. అనేక కార్ల తయారీ కంపెనీల కార్ల రేంజ్ పెంచేందుకు బ్యాటరీలను పెంచుకుంటూ పోతున్నాయి. అయితే లైట్‌ఇయర్ 0 మాత్రం ఇందుకు భిన్నంగా తక్కువ బ్యాటరీలను కలిగి సౌరశక్తితో ఛార్జింగ్ అయ్యేలా రూపకల్పన చేశారు. ఫిన్లాండ్ లో ఈ కార్ ఉత్పత్తి ప్రారంభం అయింది. 2023 చివరి నాటికి వారానికి 5 కార్ల చొప్పున విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. కారు రీఛార్జ్ చేయడంతో ఆగకుండా దాదాపుగా 388 మైళ్లు( 624 కిలోమీటర్లు) రేంజ్ ఇస్తుంది. సోలార్ ప్యానెళ్ల నుంచి 43 మైళ్ల వరకు వస్తుంది. ప్రతీ గంటలకు ఆరు మైళ్ల చొప్పున ఛార్జ్ అవుతుంది.
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!