TVS Apache RTR 160: మార్కెట్లోకి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్..బుకింగ్స్ షురూ..
- మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన టీవీఎస్ అపాచీ
- ఈ కారణంగా కస్టమర్ల కోసం మరో కొత్త వేరియంట్ విడుదల
- ఈ కొత్త ఎడిషన్ పేరు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవీఎస్ మోటార్ కి చెందిన ప్రముఖ బైక్ (TVS Apache) అపాచీ వినియోగదారులలో ప్రత్యేకమైన గుర్తింపును కూడగట్టుకుంది. దీని డిమాండ్ తగ్గడం లేదు. ఈ కారణంగా కంపెనీ ఇప్పుడు కస్టమర్ల కోసం ఈ బైక్‌కు సంబంధించిన ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ పేరు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 (TVS Apache RTR 160) రేసింగ్ ఎడిషన్. ఈ కొత్త ఎడిషన్ లో కంపెనీ అందించిన ప్రత్యేకతలు.. ధర తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గ్రే గ్రాఫిక్స్, రేసింగ్ రెడ్ స్ట్రిప్‌తో ప్రత్యేకమైన బ్లాక్ కలర్ స్కీమ్‌తో రేసింగ్ ఎడిషన్ మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ రెసిండే ఎడిషన్ మోడల్ ధర రూ. 1,28,270 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీవీఎస్ డీలర్ల వద్ద ఈ బైక్ బుకింగ్ ప్రారంభమైంది.
READ MORE: Bhatti Vikramarka: రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా ఖరారు
Also Read
- TVS Callisto 110: టీవీఎస్ కాలిస్టో 110 స్కూటర్ విడుదల.. 33 లీటర్ల స్టోరేజ్, కొత్త ఇంజిన్, ISG టెక్నాలజీ
- రూ.2.55 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. Piaggio Ape WavE ఫీచర్లు అదుర్స్!
- Explainer: 'నెతన్యాహును భూస్థాపితం చేస్తాం..' ఇది శవయాత్ర కాదు.. ఇరాన్ రణగర్జన..!
- ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
ఈ రేసింగ్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే…
టీవీఎస్ కంపెనీకి చెందిన ఈ బైక్‌లో.. TVS SmartXonnect ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే ఎల్ సీడీ (LCD) డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ అమర్చారు. ఇందులో మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లను పొందుతారు. అవి స్పోర్ట్, అర్బన్, రెయిన్. బైక్‌కు ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో గ్యాస్ ఛార్జ్ చేయబడిన ట్విన్ షాక్ అబ్జార్బర్లు అమర్చారు. బ్రేకింగ్ వేరియంట్ ఆధారంగా 270ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్, బ్యాక్ 200ఎమ్ఎమ్ డిస్క్/130ఎమ్ఎమ్ డ్రమ్ ద్వారా అందిస్తుంది. ముందు, వెనుక భాగాల్లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
READ MORE: Reels: రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి.. బస్సును ఢీకొని మృతి
ఈ మోటార్‌సైకిల్ 159.7సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, ఎఫ్ఐ ఇంజన్‌తో శక్తిని కలిగి ఉంది. 16.04పీఎస్ గరిష్ట శక్తిని 13.85ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. డబుల్ క్రెడిల్ సింక్రొనైజ్డ్ స్టిఫ్ ఛాసిస్ ఆధారంగా 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు 5-దశల ఎడ్జెస్ట్ చేయగల షాక్‌లను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
-
Tilak Varma: తిలక్ వర్మకు షాక్.. సంజూ శాంసన్‌కు గుడ్ న్యూస్..?
-
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్‌పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్‌కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..