Toyota Ebella EV: ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ కార్లతో భారత మార్కెట్‌లో తన సత్తా చాటిన టయోటా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. టయోటా తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అధికారికంగా పరిచయం చేసింది. ఆ కార్ పేరు అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా. ఈ కారు కొత్తగా అనిపించినా, చూసేవాళ్లకు కొంచెం పరిచయం ఉన్న కారులాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మారుతి ఈ-విటారా ఆధారంగా తయారైన మోడల్. అందుకే డిజైన్, ఆకృతిలో రెండు కార్లు దాదాపు ఒకేలా కనిపిస్తాయి. కానీ టయోటా తన స్టైల్‌కు తగ్గట్టు కొన్ని మార్పులు చేసి, దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది.
READ MORE: E-Rickshaw: ఈ-రిక్షా డ్రైవర్లకు షాక్.. భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. టయోటా అధికారిక వెబ్‌సైట్‌లో గానీ, దగ్గర్లోని డీలర్‌షిప్‌లో గానీ బుక్ చేసుకోవచ్చు. ధర వివరాలు ఇంకా ప్రకటించలేదు.. త్వరలోనే వెల్లడిస్తామని కంపెనీ చెబుతోంది. ఎబెల్లా రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. ఒకటి 49 యూనిట్ బ్యాటరీ, మరొకటి 61 యూనిట్ బ్యాటరీ. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని టయోటా పేర్కొంది. ఎలక్ట్రిక్ మోటార్ 128kW పవర్, 189Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లిథియం-అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌తో అమర్చిన DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది రోజూ ఆఫీస్‌కు వెళ్లేవాళ్లకైనా, లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడేవాళ్లకైనా మంచి ఆప్షన్. ఈ కారులో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ శక్తివంతంగా పనిచేస్తుంది. డ్రైవ్ చేస్తుంటే స్మూత్‌గా, శబ్దం లేకుండా ముందుకు దూసుకెళ్తుంది.
READ MORE: E-Rickshaw: ఈ-రిక్షా డ్రైవర్లకు షాక్.. భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఈ కారులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే ఎక్కువ సేపు ఛార్జింగ్ స్టేషన్ వద్ద వేచి ఉండాల్సిన పనిలేదు. వేసవిలో బ్యాటరీ వేడెక్కకుండా, చలికాలంలో పనితీరు తగ్గకుండా ఉండేందుకు ప్రత్యేక హీటింగ్, కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. బయట నుంచి చూస్తే ఎబెల్లా చాలా ఆధునికంగా కనిపిస్తుంది. ముందు వైపు సన్నని లైట్లు, స్టైలిష్ డిజైన్ దానికి ఫ్యూచర్ లుక్ ఇస్తాయి. చుట్టూ ఉన్న బలమైన క్లాడింగ్ వల్ల ఇది నిజమైన ఎస్‌యూవీలా కనిపిస్తుంది. వెనక వైపు దాచిన డోర్ హ్యాండిల్స్, కనెక్ట్ అయిన టెయిల్ లైట్స్ కారుకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. రంగుల విషయంలో కూడా టయోటా మంచి ఎంపికలు ఇచ్చింది. సింపుల్ రంగులు ఇష్టపడేవాళ్లకోసం ఒకటి, డ్యూయల్ టోన్ లుక్ ఇష్టపడేవాళ్లకోసం మరోటి.. ఇలా మొత్తం తొమ్మిది రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంటుంది.
READ MORE: UP: యూపీలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి
లోపల డిజిటల్ డిస్‌ప్లే, పెద్ద టచ్ స్క్రీన్, వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీ, చల్లగా ఉండే వెంటిలేటెడ్ సీట్లు, మ్యూజిక్ ప్రేమికుల కోసం శక్తివంతమైన సౌండ్ సిస్టమ్ ఇవన్నీ కలిసి ప్రయాణాన్ని మరింత ఆనందంగా మారుస్తాయి. రాత్రివేళ డ్రైవ్ చేస్తుంటే లోపలి లైటింగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. భద్రత విషయంలో టయోటా ఎక్కడా రాజీపడలేదు. ప్రతి వేరియంట్‌లోనూ అవసరమైన అన్ని సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. పైగా డ్రైవర్‌కు సహాయపడే ఆధునిక టెక్నాలజీ ఇచ్చారు. లేన్ తప్పితే అలర్ట్ ఇవ్వడం, ముందు వాహనం దూరాన్ని బట్టి స్పీడ్ తగ్గించడం వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా చేస్తాయి.
READ MORE: Karnataka: అది ఏఐ వీడియో.. ఆఫీసులో రాసలీలల అంశంపై ఐపీఎస్ రియాక్షన్..
బ్యాటరీ గురించి ఆందోళన పడేవాళ్ల కోసం టయోటా ప్రత్యేక హామీ ఇస్తోంది. ఈ కారుకు దీర్ఘకాల బ్యాటరీ వారంటీ ఉంది. దేశమంతా ప్రత్యేక ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయి. కావాలంటే బ్యాటరీని కొనకుండా అద్దెకు తీసుకునే అవకాశాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. ఎక్కడైనా సమస్య వస్తే సహాయం చేయడానికి రోజంతా పనిచేసే రోడ్ సైడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మొత్తానికి, అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాతో టయోటా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో గట్టి అడుగు వేసింది. స్టైల్, టెక్నాలజీ, భద్రతతో కూడిన ఈ కారు రాబోయే రోజుల్లో భారత రోడ్లపై ప్రత్యేకంగా కనిపించే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వాళ్లకు ఇది ఒక ఆసక్తికరమైన కొత్త ఎంపికగా నిలవనుంది.