NTV Telugu Site icon

Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ఓలా నుంచి టీవీఎస్ వరకు బెస్ట్ ఈవీలు ఇవే!

Tvs

Tvs

ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకంతో డబ్బులు ఆదా అవుతున్నాయి. తక్కువ ఖర్చుతోనే వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలుకలుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవీ తయారీ సంస్థలు సూపర్ ఫీచర్లు, బడ్జెట్ ధరల్లో ఈవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఓలా, బజాజ్, టీవీఎస్, ఏథర్,ఫెర్రాటో కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి.

Also Read:AP Crime: వీడు భర్తేనా..? న్యూడ్‌ కాల్స్‌ చేసి డబ్బు సంపాదించు.. భార్యకు వేధింపులు..!

టీవీఎస్ ఐక్యూబ్

TVS నుంచి iQube ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా కాలంగా మార్కెట్లో దూసుకెళ్తోంది. కంపెనీ అందించే ఈ స్కూటర్‌లో అనేక వేరియంట్లు ఉన్నాయి. కానీ, దాని చౌకైన వేరియంట్ ను రూ. 84,999 ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది 2.2 KWh సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. గంటలకు 75 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది.

బజాజ్ చేతక్ 2903

చేతక్ 2903 ను బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కూడా విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర రూ. 96 వేల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. సింగిల్ ఛార్జ్ తో 123 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 63 కిలోమీటర్లు.

Also Read:Trikala : ఆసక్తికరంగా ‘త్రికాల’ ట్రైలర్

ఓలా S1 ఎయిర్

ఓలా ఎలక్ట్రిక్ విభాగంలో S1 ఎయిర్ స్కూటర్‌ అందుబాటులో ఉంది. దీనిని రూ.1.07 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

ఏథర్ రిజ్టా

బడ్జెట్ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 99999 నుంచి ప్రారంభమవుతుంది. సింగిల్ ఛార్జ్ తో 159 కిలోమీటర్ల IDC పరిధిని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

Also Read:Sangareddy Crime: కూతురితో చనువుగా ఉంటున్నాడని వ్యక్తిని హత్య చేసిన తండ్రి..

OPG డిఫై 22

ఈ ఏడాదిలోనే OPG మొబిలిటీ ద్వారా ఫెర్రాటో డిఫై 22 అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి విడుదలైంది. ఈ స్కూటర్‌ను రూ. 99999 ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. సింగిల్ ఛార్జ్ తో ఇది 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది.