Site icon NTV Telugu

Tata Sierra: ఏంది మామా ఈ క్రేజ్.. టాటా సియెర్రాకు తొలి రోజే 70,000 బుకింగ్స్..

Tata Sierra

Tata Sierra

Tata Sierra: టాటా మోటార్స్ (Tata Motors) నుంచి వచ్చిన లెటెస్ట్ SUV సియెర్రా(Sierra) బుకింగ్స్‌లో అదరగొడుతోంది. బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజే 70,000 బుకింగ్స్ వచ్చాయి. మరో 1.35 లక్షల మంది కస్టమర్లు తమకు నచ్చిన వేరియంట్, కాన్ఫిగరేషన్‌ను ఎంపిక చేసుకుని బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసే దశలో ఉన్నారని కంపెనీ వెల్లడించింది. టాటా సియెర్రా బాక్సీ డిజైన్ కార్ లవర్స్‌ను ఆకట్టుకుంది. రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) అగ్రిసివ్ ప్రారంభ ధర కూడా వినయోగదారుల్ని ఆకర్షించింది.

టాటా కార్‌లలో ఎప్పుడూ లేనట్లుగా డాష్ బోర్డుపై మూడు స్క్రీన్లను అందించింది. డ్రైవర్ కోసం ఒకటి, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం రెండు స్క్రీన్లు ఉన్నాయి. మెరుగైన ఇంటీరియర్ డిజైన్ కలిగి ఉంది. ఈ ఈ SUV LED హెడ్‌లైట్‌లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు కారును మరింత స్టైలిష్‌గా మారుస్తున్నాయి. టాటా కర్వ్‌లో ఉన్నట్లే 4-స్పోక్ స్టీరింగ్ వీల్‌ కూడా సియెర్రాలో ఉంది. 12-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్, సోనిక్‌షాఫ్ట్ సౌండ్‌బార్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, అందుబాటులో ఉన్న అన్ని కార్లతో పోలిస్తే అతిపెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ డాక్, వెనుక సన్‌షేడ్‌లు, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు వంటి సౌకర్యాలను కూడా ఉన్నాయి.

Read Also: Pakistan: పాక్‌కు పెద్ద కష్టమే వచ్చింది.. అసిమ్ మునీర్ ముందు నుయ్యి, వెనక గొయ్యి..

భద్రతకు సంబంధించి టాటా సియెర్రా లెవల్ 2 ADAS సూట్‌తో వస్తుంది, ఇందులో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్ బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ మరియు ఇతర లక్షణాలతో పాటు 21 ఫంక్షన్‌లను అందించే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్‌బెల్ట్ యాంకర్ ప్రెటెన్షనర్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సేఫ్టీ టెథర్‌లు, అందరు ప్రయాణీకులకు 3-పాయింట్ ELR సీట్ బెల్ట్‌లు ఉన్నాయి.

సియెర్రా పెట్రోల్, డిజిల్ వేరియంట్లను కలిగివ ఉంది. పెట్రోల్ వేరియంట్‌లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (160 hp , 255 Nm) 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో అందుబాటులో ఉంది. న్యాచురల్లి ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (106 hp, 145 Nm ) మాన్యువల్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తుంది. డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ ఇంజిన్ (118 hp) మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లతో లభిస్తుంది. దీంట్లో 6-స్పీడ్ మాన్యువల్ 260 Nm టార్క్, 6-స్పీడ్ ఆటోమేటిక్ 280 Nm టార్క్‌ను కలిగి ఉంటుంది.

Exit mobile version