Site icon NTV Telugu

Tata Sierra: నెల రోజులు కాకముందే.. 29.9 కిమీ మైలేజ్ సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం..

Tata Sierra

Tata Sierra

Tata Sierra: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం నుండి భారత మార్కెట్‌లో సియెరా SUVను లాంచ్ చేసింది. ఐకానిక్ పేరును తిరిగి తెచ్చిన ఈ మోడల్‌ను సంస్థ రూ.11.49 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకవచ్చింది. లాంచ్ అయిన మొదటి రోజు నుంచే ఈ SUVకు ప్రజాదరణ భారీగా పెరుగుతోంది. దీనిని మరింత పెంచేందుకు టాటా కంపెనీ పలు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా ఇండోర్‌లోని NATRAX ట్రాక్‌లో నిర్వహించిన పరీక్షలో సియెరా 29.9 కిమీ మైలేజ్ సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది.

Akhanda2 Release Teaser: ఎవర్రా నిప్పుల కొండను ఆపేది..! అఖండ 2 కొత్త టీజర్ చూశారా..

ఈ రికార్డు 12 గంటల పాటు చేసిన పరీక్షలో నమోదైంది. ఈ పరీక్ష కోసం టాటా కొత్తగా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ హైపీరియన్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన మోడల్‌ను ఉపయోగించారు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న ఈ ఇంజిన్ 160 hp పవర్, 255 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతకుముందు ఇదే హైపీరియన్ ఇంజిన్‌తో నియంత్రిత పరిస్థితుల్లో సియెరా 222 కి.మీ గరిష్ట వేగాన్ని నమోదు చేసింది.

హైపీరియన్ వెర్షన్‌తో పాటు సియెరా SUVలో మరిన్ని ఇంజిన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 106 హెచ్‌పీ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్‌తో లభిస్తుంది. డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్ ఇంజిన్ 118 hp పవర్‌తో అందుబాటులో ఉంది. ఇది 260 nm టార్క్ ఇచ్చే 6 స్పీడ్ మాన్యువల్, 280 nm టార్క్ ఇచ్చే 6 స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లతో వస్తుంది.

కేబిన్ విషయానికి వస్తే.. టాటా సియెరా లగ్జరీ ఇంటీరియర్‌ను అందిస్తుంది. మూడు డాష్‌బోర్డ్ డిస్ప్లేలు, డ్రైవర్‌డిస్‌ప్లేతో పాటు రెండు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లు ఉన్నాయి. కర్వ్ SUVలో కనిపించిన నాలుగు స్పోక్స్ స్టీరింగ్ వీల్, ఇల్యూమినేటెడ్ టాటా లోగో, టచ్ కంట్రోల్స్ ఇందులో కొనసాగించబడ్డాయి. 12-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్, సెగ్మెంట్‌లో తొలి సోనిక్‌షాఫ్ట్ సౌండ్‌బార్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, భారత్‌లో అతి పెద్ద పానోరామిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, రియర్ సన్‌షేడ్స్, వెంటిలేటెడ్ అండ్ ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు అందించబడ్డాయి.

Shahid Afridi on RO-KO: రికార్డులు బద్దలు కొట్టడానికే ఉంటాయి.. రోహిత్ శర్మ రికార్డ్ పై ఆఫ్రిది ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

సేఫ్టీ పరంగా కూడా సియెరా అగ్రగామిగా నిలుస్తుంది. లెవల్ 2 ADAS ప్యాకేజీలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ వ్యూ కెమెరా, డ్యూయల్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, 21 ఫీచర్లతో ESP అందించబడింది. వీటితోపాటు 6 ఎయిర్‌బ్యాగ్స్, సీట్‌బెల్ట్ యాంకర్ ప్రీ టెన్షనర్స్, చైల్డ్ సేఫ్టీ కోసం ISOFIX అటాచ్మెంట్స్, అన్ని ప్రయాణికులకు 3-పాయింట్ ELR సీట్‌బెల్ట్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి.

Exit mobile version