Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Tata Nexon Vs Maruti Victoris Accident Safety Debate

Nexon vs Victoris: మారుతి సుజుకి విక్టోరిస్, టాటా నెక్సాన్ ఎదురెదురుగా ఢీ.. కార్ల అసలు సేఫ్టీ బట్టబయలు!

Published Date :December 9, 2025 , 9:50 am
By RAMAKRISHNA KENCHE
Nexon vs Victoris: మారుతి సుజుకి విక్టోరిస్, టాటా నెక్సాన్ ఎదురెదురుగా ఢీ.. కార్ల అసలు సేఫ్టీ బట్టబయలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tata Nexon vs Maruti Victoris Crash: టాటా కార్లు నాణ్యతకు మారుపేరుగా నిలిచాయి. ఎన్నో రోడ్డు ప్రమాదాల్లో ప్రయాణికులకు పెద్ద గాయాలు కాకుండా బయటపడ్డారు. కొనుగోలుదారులు భద్రతపై దృష్టి పెడుతుండటంతో ఇటీవలి మారుతి సుజుకి వంటి ఇతర దేశీయ కంపెనీలు సైతం కార్ల భద్రతపై ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలుపెట్టాయి. అయితే.. తాజాగా ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ ప్రమాదం ప్రయాణికుల భద్రతపై కంపెనీ ప్రాధాన్యతను చూపించింది. మారుతి విక్టోరిస్, టాటా నెక్సాన్ ఒక మలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదం తర్వాత రెండు కంపెనీల కార్ల భద్రతపై కొత్తగా చర్చ మొదలైంది.

READ MORE: Abhishek Sharma: ఇదేం క్రేజ్ రా మామ.. ఈ ఏడాది పాకిస్తాన్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన భారత క్రికెటర్ ఎవరంటే?

డెహ్రాడూన్ వాలే ఆఫీషియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా ప్రాంతంలో జరిగిన కారు ప్రమాద దృష్యాలు ఈ పోస్ట్‌లో ఉన్నాయి. మొదట మారుతి విక్టోరిస్ కారు వెనుక భాగం నుంచి వీడియోను మొదలు పెట్టారు. ఆ కారు మలుపు వద్ద టాటా నెక్సాన్‌ను ఢీకొట్టినట్టుగా చూపించారు. ప్రమాదానికి గురైన కారు టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో టాటా నెక్సాన్ కుడి వైపు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. బోనెట్‌పై గట్టి ఢీకొట్టిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి. ముందు బంపర్, హెడ్‌లైట్లు, ఫెండర్, ఫాగ్ ల్యాంప్స్ అన్నీ బాగా డ్యామేజ్ అయ్యాయి. డ్రైవర్ సైడ్ ముందు చక్రం కూడా దెబ్బతిన్నట్లు కనిపించింది. సాధారణంగా నెక్సాన్ బలమైన బాడీకి పేరుంది. భారీ ప్రమాదాల్లోనూ వాహనం స్వల్ప డ్యామేజ్‌తో బయటపడుతుంది. కానీ ఈ ప్రమాదంలో మాత్రం బలంగా ఢీ కొనడంతో ఎక్కువగానే దెబ్బతింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. మారుతి సుజుకి విక్టోరిస్ కారుకు తక్కువ నష్టం జరిగింది. దాని బంపర్, హెడ్‌ల్యాంప్, ఫెండర్ మాత్రమే దెబ్బతిన్నాయి. చక్రాలు మాత్రం బాగానే ఉన్నాయి.

READ MORE: Himachal Pradesh: అరుదైన సంఘటన.. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు ప్రత్యక్షం

ఈ ఘటనలోని ప్రమాదానికి గురైంది టాటా నెక్సాన్ పాత మోడల్ కారు. భారత్ NCAP రాకముందే పరీక్షించారు. అప్పట్లో ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. అయితే అప్పటి పరీక్షల ప్రమాణాలు ఇప్పుడు ఉన్న ప్రమాణాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఈ వీడియోలో ఎంత డ్యామేజ్ కనిపించినా, నెక్సాన్ ఇప్పటికీ బలమైన SUVనే నిలుస్తోంది. ఒక్క ప్రమాదం ఆధారంగా నెక్సాన్ అసురక్షితం అని చెప్పడం సరైంది కాదు. దాని భద్రతపై ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. మరోవైపు.. మారుతి సుజుకి విక్టోరిస్ కంపెనీ నుంచి 5 స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ పొందిన తొలి SUVలలో ఒకటి. పెద్దల భద్రతలో 32 పాయింట్లకు గానూ 31.66 పాయింట్లు, పిల్లల భద్రతలో 49కు గానూ 43 పాయింట్లు సాధించింది. రెండు కార్లు కూడా ఇప్పటికీ బలమైన, సురక్షితమైన మోడళ్లుగానే గుర్తింపు పొందాయి. అయితే విక్టోరిస్ కొత్త మోడల్ కావడం వల్ల, ఆధునిక మెటీరియల్స్ వాడటం ద్వారా నిర్మాణ బలం మరింత పెరిగింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bharat NCAP
  • car safety India
  • Global NCAP
  • Maruti Victoris
  • Maruti Victoris accident

తాజావార్తలు

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

  • Mix Veg Raita Recipe: సమ్మర్‌లో కూల్‌గా ఇలా మిక్స్ వెజ్ రైతా రెడీ.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..

  • PM Modi: నారీశక్తి బిల్లుకు అండగా ఉందాం.. దేశ ప్రజలకు మోడీ పిలుపు

  • Gold Rates: హమ్మయ్య.. మగువలకు పండగే పండగ.. దిగొచ్చిన బంగారం ధరలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions