2025 కాలగర్భంలో కలిసిపోయేందుకు ఇంకొన్ని రోజులే మిగిలి ఉంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల లిస్ట్ ను గూగుల్ విడుదల చేస్తోంది. ఈ క్రమంలో ఓ లిస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ జాబితా చాలా ఆసక్తికరంగా మారింది. ఈ సంవత్సరం పాకిస్తాన్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి బాబర్ ఆజం లేదా షాహీన్ షా అఫ్రిది కాదు, అతను ఓ భారతీయుడు. ఈ భారతీయుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేదా నీరజ్ చోప్రా అనుకుంటే పొరపాటే. ఈ ఏడాది పాకిస్తాన్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ.
Also Read:Weight loss: శరీర బరువు విపరీతంగా పెరిగిపోతుందా .. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ప్రపంచ నంబర్ 1 T20I బ్యాట్స్‌మన్ అయిన అభిషేక్ 2025లో పొట్టి ఫార్మాట్‌లో నిలకడగా రాణించాడు. 2025 ఆసియా కప్‌లో 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆసియా కప్ సూపర్ 4 దశలో పాకిస్థాన్‌పై 39 బంతుల్లో 74 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ పాకిస్తాన్ బౌలర్లను చిత్తు చేశాడు. యువ క్రికెటర్ తన మొదటి ఓవర్లోనే షాహీన్‌ను దెబ్బతీశాడు. ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్లందరికి చెమటలు పట్టించాడు. 2025లో 17 T20I మ్యాచ్‌ల్లో 47.25 సగటుతో 756 పరుగులు చేశాడు. ఈ కాలంలో శర్మ ఒక సెంచరీ సాధించాడు.
Also Read:Starlink: అమెరికా, దుబాయ్, భూటాన్, బంగ్లాదేశ్‌లలో.. స్టార్‌లింక్ ప్లాన్ ధర ఎంతంటే?
దక్షిణాఫ్రికా T20 కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. నేను సన్‌రైజర్స్‌లో అభిషేక్‌తో కలిసి గతంలో ఆడాను. అతను గొప్ప ఆటగాడు. బాగా బ్యాటింగ్ చేస్తాడు. ఇది మాకు పెద్ద వికెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు” అని మంగళవారం బారాబతి స్టేడియంలో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు ముందు ఐడెన్ అన్నాడు. “కొత్త బంతిని ఎవరు వేసినా, అభిషేక్ శర్మ ముందుగానే అవుట్ చేయడం సవాలుగా ఉంటుంది. అతను మ్యాచ్ విన్నర్. ఇది మాకు ముఖ్యమైన వికెట్. నిర్భయంగా బ్యాటింగ్ చేస్తాడు. మొదటి బంతి నుంచే ఆటను తన ఆధీనంలోకి తీసుకుంటాడు” అని ప్రోటీస్ కెప్టెన్ అన్నాడు.