NTV Telugu Site icon

Tata Nexon facelift: నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని రివీల్ చేసిన టాటా.. సోనెట్, వెన్యూ, XUV 300కి వణుకే.. ఎలా ఉందో లుక్కేయండి..

Tata Nexon Facelift

Tata Nexon Facelift

Tata Nexon facelift: మోస్ట్ అవెటెడ్ కార్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని రివీల్ చేసింది. చాలా రోజులుగా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎలా ఉంటుందా..? అని వెయిట్ చేస్తున్నవారికి కొత్త నెక్సాన్ ను పరిచయం చేసింది. గతంలో పోలిస్తే చాలా స్టైలిష్ లుక్స్ తో నెక్సాన్ రాబోతోంది. ఇండియాలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ కార్ల అమ్మకాల్లో ఈ టాటా కాప్ టాప్ పొజిషన్ లో ఉంది. కొత్తగా రాబోతున్న నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 300 పోటీ ఇస్తుంది.

కొత్తగా రాబోతున్న ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌లో నెక్సాన్ ఇంటీరయర్స్, ఎక్స్‌టీయర్స్ చాలా మారాయి. పూర్తిగా స్పోర్టీ లుక్స్ తో వస్తోంది. గతంలో పోలిస్తే అనేక టెక్ ఫీచర్లు ఇందులో జతచేశారు. గ్రిల్ సీక్వేయల్ LED DRL, ఫంక్షనల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, వెనకాల కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ కారుకు మరింత అట్రాక్షన్ తీసుకువస్తున్నాయి. 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ మరింత స్టోర్టీగా కనిపిస్తుంది.

Read Also: West Bengal : బెంగాల్‌ ఉప ఎన్నికల్లో టీఎంసీపై కాంగ్రెస్‌, సీపీఐఎం ఘాటు వ్యాఖ్యలు

అదిరిపోయే ఫీచర్లు..

లోపల డాష్ బోర్డు డిజైన్ చాలా వరకు మారింది. 10.25 ఇంచ్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ కార్ ఫ్లే, ఆపిల్ కార్ ఫ్లేలను సపోర్ట్ చేస్తుంది. లెథెరెట్ ఫ్రంట్ సీట్లు విత్ ఆర్మ్ రెస్ట్, వెంటిలేటెడ్ సీట్లు కొత్త నెక్సాన్ లో ఉన్నాయి. వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, వైర్ లెస్ ఛార్జెర్ ఫీచర్లు ఉన్నాయి.

భద్రత విషయంలో నెక్సాన్ 5 స్టార్ NCAP రేటింగ్ సాధించింది. భారత దేశంలోనే అత్యంత సేఫ్టీ కలిగిన కారుగా పేరుంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో 360-డిగ్రీల సరౌండ్ వ్యూ సిస్టమ్, బ్లైండ్ వ్యూ మానిటర్, ESP, TPMS, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లతో కూడిన ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు కార్నరింగ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్ వివరాలు..

కొత్త నెక్సాన్ లో Revotron 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (120PS/170Nm) మరియు Revotorq 1.5-లీటర్ డీజిల్ (115PS/260Nm) ఇంజిన్‌ల ఆప్షన్లను కొనసాగిస్తోంది. ఉపయోగించడం కొనసాగిస్తోంది. పెట్రోల్ ఇంజన్ ఇంతకుముందు 6-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AMT ఆప్ఫన్లు ఉండగా.. కొత్త 5-స్పీడ్ MT మరియు 7-స్పీడ్ DCA ఇంజన్ ఆప్షన్లతో వస్తోంది. డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AMT ఆప్షన్లు ఉన్నాయి.