Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2026లో మొదటి 10 నెలల్లోనే 2025 పూర్తి ఏడాది అమ్మకాల సంఖ్యను అధిగమించింది. జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 6,49,477 ప్యాసింజర్ వాహనాలను అమ్మేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన 4,71,290 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 37.81% పెరిగాయి. మరోవైపు 2025 పూర్తి ఏడాదిలో టాటా మోటార్స్ విక్రయించిన 5,78,772 యూనిట్ల కంటే ఈసారి ఇప్పటికే 70,705 వాహనాలు అధికంగా అమ్ముడయ్యాయి కూడా.
భారీ అమ్మకాలు..
2026 సెప్టెంబర్ చివరి నాటికి టాటా మోటార్స్ 5,75,583 వాహనాలను విక్రయించింది. దీంతో 2025 పూర్తి ఏడాది అమ్మకాల రికార్డును అధిగమించడానికి మరో 3,189 యూనిట్లు మాత్రమే అవసరమయ్యాయి. అక్టోబర్‌లో ఏకంగా 73,894 వాహనాలను విక్రయించడంతో ఆ రికార్డును సులభంగా అధిగమించింది. గతేడాది అక్టోబర్‌లో నమోదైన 61,134 యూనిట్లతో పోలిస్తే ఈసారి అమ్మకాలు 20.87% పెరిగాయి. సెప్టెంబర్‌లో విక్రయించిన 68,810 యూనిట్లతో పోలిస్తే కూడా 7.39% వృద్ధి నమోదైంది. 2026 జనవరిలో 70,222 వాహనాలను విక్రయించిన టాటా.. ఫిబ్రవరిలో 62,329 యూనిట్లకు చేరింది. మార్చిలో 66,192 యూనిట్లు, ఏప్రిల్‌లో 59,000 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఆపై మే నుంచి అక్టోబర్ వరకు ప్రతినెలా అమ్మకాలు పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా జూన్‌లో గతేడాది ఇదే నెలతో పోలిస్తే 67.4% వృద్ధి నమోదైంది. ఈ నెలలో 62,076 వాహనాలు విక్రయించింది.
Also Read
- Kove 650RR: 650cc స్పోర్ట్స్ బైక్‌లో ఫ్రంట్, రియర్ కెమెరాలు.. 108.7hp పవర్‌తో Kove 650RR ఎంట్రీ
- Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
- BYD Denza Z9 GT: భారత్‌లో BYD Denza Z9 GT లాంచ్.. 2.7 సెకన్స్ లో 100 kmph స్పీడ్, 670KM రేంజ్!
- BYD Denza D9: భారత్‌లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్‌బ్యాగ్స్.. ధర ఎంతంటే?
2026 క్యాలెండర్ ఇయర్లో మరో రెండు నెలలు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం 7 లక్షల ప్యాసింజర్ వాహనాల అమ్మకాల మైలురాయిని చేరుకోవాలంటే టాటా మరో 50,523 యూనిట్లను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అదే 8 లక్షల మార్కును అందుకోవాలంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి ఏకంగా 1,50,523 వాహనాలు అమ్మాలి. అంటే నెలకు సగటున 75,262 యూనిట్ల అమ్మకాలు సాధించాల్సి ఉంటుంది. అక్టోబర్‌లో నమోదైన 73,894 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ.
టాటా పంచ్ టాప్.. నెక్సాన్ నెక్స్ట్..
అమ్మకాల్లో మోడళ్ల వారీగా అమ్మకాలను పరిశీలిస్తే.. టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచింది. జనవరి నుంచి అక్టోబర్ 2026 వరకు మొత్తం 2,02,794 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది పూర్తి ఏడాది అమ్మకాల కంటే కూడా 29,292 యూనిట్లు అధికంగా విక్రయించింది. ఇక నెక్సాన్ 1,96,490 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు మోడళ్లు కలిపి మొత్తం టాటా ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 61.48% వాటాను సొంతం చేసుకున్నాయి. ఆపై టియాగో 70,555 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన సియెర్రా కూడా అదరగొడుతోంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు 69,779 కార్లు అమ్ముడయ్యాయి. ఇక సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఏరిస్ మోడల్ 6,411 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇతర మోడళ్ల విషయానికి వస్తే.. హారియర్ 31,810 యూనిట్లు, ఆల్ట్రోజ్ 27,579 యూనిట్లు, కర్వ్ 18,447 యూనిట్లు, సఫారీ 17,088 యూనిట్లు, టిగోర్ 8,524 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. ముఖ్యంగా హారియర్ గతేడాది పూర్తి ఏడాది అమ్మకాలైన 27,410 యూనిట్లను కూడా అధిగమించింది.
ఈవీల వాటా..
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనూ టాటా మోటార్స్ మంచి వృద్ధిని సాధించింది. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 1,24,792 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో ఈవీల వాటా 19.21%గా ఉంది. అంటే టాటా విక్రయిస్తున్న ప్రతి ఐదు కార్లలో దాదాపు ఒకటి ఎలక్ట్రిక్ కారు కావడం విశేషం.
తాజావార్తలు
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
IND vs NZ: తక్కువ స్కోరుతోనే టీమిండియా సంచలనం.. 46 ఏళ్ల రికార్డు జాబితాలో భారత్!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Koti Deepotsavam 2026: అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం.. మూడో రోజు విశేష కార్యక్రమాలు ఇవే..!
-
Arshdeep Singh: నేను బంతికి భయపడతా అంటారు.. కానీ ఎలా ఆడనో చూశారు కదా!
ట్రెండింగ్
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!