Tata Harrier.ev: టాటా మోటార్స్(Tata Motors) ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నెక్సాన్.ev (Nexon.ev ) టాప్ పొజిషన్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు హారియర్ఈవీ (Harrier.ev) కూడా అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభమైన హారియర్ ఈవీ, అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్రిక్ SUVగా మారింది. నెక్సాన్.ఈవీని దాటి సేల్స్‌ను హారియర్ ఈవీ సేల్స్‌లో దూసుకుపోతోంది.
ఇటీవల డేటా ప్రకారం, Harrier.ev ఒకే నెలలో 2458 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మరోవైపు, Nexon.ev కార్లు 2230 యూనిట్లు సేల్ అయ్యాయి. ఇది హారియర్ ఈవీ అమ్మకాల పెరుగుదలను సూచిస్తోంది. టాటా 2025 మధ్యకాలం నుంచి ఎలక్ట్రిక్ అమ్మకాల్లో నెలవారీ లాభాలను చూస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈవీ కార్ మార్కెట్లో 42 శాతం కలిగి ఉంది. Harrier.ev, Nexon.ev , Punch.ev, Tiago.evలు కూడా అమ్మకాలకు దోహదపడ్డాయి.
Nexon.ev తో పోలిస్తే Harrier.ev టాటా ఎలక్ట్రిక్ కార్లలో ప్రీమియంగా నిలిచింది. రూ.21.49 లక్షల నుండి రూ.30.23 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ధర ఉంది. ఇది పూర్తిగా SUV బ్రాండ్‌కు సంబంధించి Acti.ev Gen 2 ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడింది. ఇది రియల్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ తో వస్తోంది. వేరియంట్‌ను బట్టి, ఈ కార్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 600 కి.మీ కంటే రేంజ్ వస్తుంది.
Read Also: Polar Loop: పోలార్ లూప్ స్క్రీన్-ఫ్రీ ఫిట్నెస్ ట్రాకర్ రిలీజ్.. 24/7 హెల్త్ ట్రాకింగ్.. ఇంత ధరనా!
హారియర్‌లో 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. 75 kWh ప్యాక్ 627 కి.మీ పరిధిని అందిస్తుంది. 120 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో, Harrier.ev కేవలం 15 నిమిషాల్లో 250 కి.మీ పరిధిని అందిస్తుంది. దాదాపు 25 నిమిషాల్లో 20 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఆల్ వీల్ డ్రైవ్ hp ఫ్రంట్ మోటార్, 234 hp వెనుక మోటార్‌ను కలిసి ఏకంగా 504 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.3 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఆల్ వీల్ డ్రైవ్‌లో బూస్ట్, స్పోర్ట్స్, సిటీ, ఎకో మోడ్స్ ఉన్నాయి. రేర్ వీల్ డ్రైవ్‌లో ఎకో, సిటీ, స్పోర్ట్ మోడ్లు ఉంటాయి.
నెక్సాన్ ఈవీని కాదని హారియర్ ఈవీని ఎంచుకోవడానికి దాని ఫీచర్లు కూడా కారణం అవుతున్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, పవర్డ్ టెయిల్‌గేట్, కూల్డ్ ఆర్మ్‌రెస్ట్ స్టోరేజ్ మరియు పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వెహికల్-టు-లోడ్, వెహికల్-టు-వెహికల్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 7 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌తో ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ హోల్డ్, డిసెంట్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు , లెవల్ 2 ADAS ఫంక్షన్ ఉంది. 540-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, డిజిటల్ రియర్-వ్యూ మిర్రర్ మరియు డిజిటల్ కీ సిస్టమ్ ఉన్నాయి.