NTV Telugu Site icon

Hyundai Cars Price: హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్‌.. ఈనెల 31 వరకే అవకాశం!

Hyundai Venue

Hyundai Venue

భారతదేశంలో హ్యుందాయ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. హ్యుందాయ్ మోటార్ దేశంలోని అతిపెద్ద వాహనాల విక్రయ కంపెనీలలో ఒకటి. డిసెంబర్ 2024లో హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపులు ఇస్తోంది. కంపెనీ హ్యుందాయ్ వెన్యూలో గరిష్ట ప్రయోజనాలు అందజేస్తోంది. గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ20 కార్ల ధరలు కూడా తగ్గాయి. అయితే.. ఈ కార్ల ధరలను తిరిగి జనవరి 1, 2025 నుంచి పెంచుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్‌లు డిసెంబర్ 31 వరకు వర్తించే అవకాశం ఉంది!

READ MORE: Vijayasai Reddy Tweet on Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి ట్వీట్‌ వైరల్..

హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపు
ఈ సంవత్సరం చివరి నెలలో హ్యుందాయ్ వాహనాలపై భారీ ఆఫర్ ప్రకటించింది. హ్యుందాయ్ వెన్యూలో రూ.75,629 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఆన్-రోడ్ ధర రూ.9.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ.68 వేల వరకు ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.6.62 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

READ MORE:BJP MP K Laxma: తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ విగ్రహం పెట్టట్లేదు కదా.. కేటీఆర్ పై లక్ష్మణ్ ఫైర్..

హ్యుందాయ్ ఐ20..
హ్యుందాయ్ ఐ20పై రూ.65 వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఆన్-రోడ్ ధర రూ. 8.03 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ ఎక్సెటర్ రూ. 52,972 వరకు తగ్గింపు ఆఫర్‌ను కలిగి ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.13 లక్షల నుంచి మొదలై రూ. 10.43 లక్షల వరకు ఉంటుంది.

READ MORE:Pushpa -2 : రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ డ్రాప్.. కారణం ఇదే..?

వచ్చే ఏడాది పెరగనున్న ధరలు..
జనవరి 1, 2025 నుండి కార్ల ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా డిసెంబర్ 5 గురువారం ప్రకటించింది. ఈ కొరియన్ ఆటో దిగ్గజం క్రెటా, వెన్యూ, ఎక్స్టర్, టక్సన్, అల్కాజర్ వంటి పాపులర్ ఎస్యూవీలతో పాటు వెర్నా ఐ 20, ఐ 10, తమ ఏకైక ఎలక్ట్రిక్ వాహనం అయోనిక్ 5తో సహా భారత్‌లో అందుబాటులో ఉన్న అన్ని మోడళ్ల ధరలను పెంచనుంది. ఇన్ పుట్ మెటీరియల్ ఖర్చు పెరగడం, లాజిస్టిక్స్ ఖర్చు, ప్రతికూల మారకం రేట్ల కారణంగా వచ్చే నెల నుంచి ధరల పెంపు అనివార్యమైందని హ్యుందాయ్ తెలిపింది.

Show comments