భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వృద్ధి ముందుకు సాగుతుంది. 2023 నాటికి దేశంలోని ఈవీ రంగంలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల తెలిపారు. 2030 నాటికి భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ సంభావ్యత రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థ వార్త నివేదిక ప్రకారం.. 2030 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 4 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.
READ MORE: Air India: తొలి ఫ్లైట్ జర్నీలో మద్యం, ఫుడ్ ఖాళీ చేసేసిన సూరత్ ప్యాసింజర్స్!
భారతదేశంలో 40 శాతం వాయు కాలుష్యం రవాణా రంగం వల్ల సంభవిస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి తెలిపారు. భారతదేశం ఏటా రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటుంది. ఇది దేశానికి పెద్ద ఆర్థిక సవాలు. ఈ శిలాజ ఇంధనాల దిగుమతి మన దేశంలో చాలా సమస్యలను సృష్టిస్తోంది. దేశంలో విద్యుత్ వినియోగంలో 44 శాతం సౌరశక్తి నుంచి వస్తుంది. దీంతో ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారిస్తోంది. మన జలవిద్యుత్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ తర్వాత సౌరశక్తి, గ్రీన్ ఎనర్జీ, ముఖ్యంగా బయోమాస్ నుంచి వచ్చే శక్తిని అభివృద్ధి పరుస్తున్నాం. సౌరశక్తి మనందరికీ ముఖ్యమైన వనరులలో ఒకటి. భారతదేశం ఎలక్ట్రిక్ బస్సుల కొరతను ఎదుర్కొంటోంది. మన దేశానికి లక్ష ఎలక్ట్రిక్ బస్సులు చాలా అవసరం. అయితే మన దేశ కెపాసిటీ ప్రకారం.. 50,000 బస్సులు తయారు చేయగలం. ఈ బస్సులను తయారు చేసేందుకు, ఫ్యాక్టరీలను విస్తరించేందుకు ఇదే సరైన సమయం.” అని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే ఫ్యాక్టరీలు ప్రారంభించాలని కంపెనీలను ఆయన అభ్యర్థించారు.
READ MORE: Vijayawada: న్యూ ఇయర్‌కు కొత్త బ్రాండ్లతో వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైన బెజవాడ
ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఆటోమొబైల్ కంపెనీలను కూడా గడ్కరీ కోరారు. 2014లో తాను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.7 లక్షల కోట్లు అని చెప్పారు. నేడు ఆటోమొబైల్ రంగం పరిమాణం రూ.22 లక్షల కోట్లని తెలిపారు. ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు.