Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
- కొత్త Nissan Pixo EV పరిచయం
- రేంజ్, ఛార్జింగ్, ఫీచర్లు పూర్తి వివరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nissan Pixo EV Launch: ఎలక్ట్రిక్ కార్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ కొత్త ఎలక్ట్రిక్ కారును గ్లోబల్ మార్కెట్లో పరిచయం చేసింది. Nissan Pixo పేరుతో తీసుకొచ్చిన ఈ కారు ప్రధానంగా యూరప్‌లోని నగర వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారులో అందిస్తున్న ఫీచర్లు, రేంజ్, ఛార్జింగ్ సామర్థ్యం ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తున్నాయి.
Nissan Pixo ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ
నిస్సాన్ తాజాగా గ్లోబల్ స్థాయిలో కొత్త ఎలక్ట్రిక్ కారుగా Nissan Pixoను పరిచయం చేసింది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా ఈ కారును రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. చిన్న సైజు, ఆధునిక టెక్నాలజీతో పాటు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను ఇందులో అందించారు.
Also Read
- BYD Denza D9: భారత్‌లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్‌బ్యాగ్స్.. ధర ఎంతంటే?
- KTM X-Bow Arrow: KTM నుంచి కొత్త ఆఫ్‌రోడ్ వాహనం.. 500 యూనిట్లే, ధర రూ.92.4 లక్షలు
- TVS Callisto 110: టీవీఎస్ Callisto 110 స్కూటర్ లాంచ్.. 33 లీటర్ల స్టోరేజ్, బ్లూటూత్, నావిగేషన్‌తో అదిరిపోయే ఫీచర్లు!
- Chery Tiggo: విరిగిన యాక్సిల్.. ఊడిపోయిన చక్రాలు! భారత్ మార్కెట్లోకి రాకముందే చైనా కార్ల బ్రాండ్ పరువు గాల్లోకి..
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 259 కి.మీ రేంజ్
Nissan Pixoలో లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. పూర్తి ఛార్జింగ్‌తో 259 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించగలదని కంపెనీ పేర్కొంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా బ్యాటరీని 15 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 28 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చని నిస్సాన్ తెలిపింది.
Nissan Pixoలో కీలక ఫీచర్లు
Nissan Pixoలో ఆధునిక టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో పలు ఆకర్షణీయమైన ఫీచర్లు అందిస్తున్నారు. LED హెడ్లైట్లు, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, Built-in Google, Gemini వాయిస్ అసిస్టెంట్, 16 భాషలకు సపోర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, వన్-పెడల్ డ్రైవింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఈ ఎలక్ట్రిక్ కారులో అందించారు.
2027 ప్రారంభంలో యూరప్‌లో డెలివరీ
ప్రస్తుతం Nissan Pixoను నిస్సాన్ పరిచయం మాత్రమే చేసింది. యూరప్‌లోని పలు దేశాల్లో ఈ కారు డెలివరీలు 2027 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. కారు ధర, పూర్తి స్పెసిఫికేషన్లను డిసెంబర్ నాటికి వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
భారత్‌లో Nissan Pixo విడుదల అవుతుందా?
ప్రస్తుతం Nissan Pixoను ప్రధానంగా యూరప్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేశారు. మొదట యూరప్‌లో విడుదల చేసిన తర్వాత జపాన్ మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకురావచ్చని తెలుస్తోంది. అయితే భారత్‌లో ఈ కారును విడుదల చేయడంపై నిస్సాన్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ, భారత మార్కెట్లో కూడా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో 2027లో Nissan Pixo భారత్‌లోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. దీనిపై కంపెనీ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Chiranjeevi: ‘మెగాస్టార్’ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
-
Bhagwant Mann’s Pakistan Visit: భగవంత్ మాన్ పాకిస్థాన్ పర్యటనకు అనుమతి వస్తుందా?.. కేంద్రం కీలక ప్రకటన
-
RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
-
BYD Denza D9: భారత్‌లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్‌బ్యాగ్స్.. ధర ఎంతంటే?
-
Usman Khawaja: ఉస్మాన్ ఖవాజా బెడ్‌పై మైఖేల్ బీర్ ఆ పని చేశాడా?.. వెలుగులోకి సంచలనం విషయం!
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!