New Kia Seltos: లాంచ్‌కు ముందే రోడ్డెక్కిన కియా.. మొదలైన New Seltos 2026 ప్రొడక్షన్..!
- అనంతపురం ప్లాంట్‌లో ఆల్-న్యూ Kia Seltos ఉత్పత్తి ప్రారంభం..
- బిగ్, బోల్డ్, స్టేబుల్’గా మిడ్-SUV సెగ్మెంట్‌లో కొత్త ఛాప్టర్..
- మిడ్-SUVలో మరోసారి బెంచ్‌మార్క్ టార్గెట్.. కొత్త Seltosతో ‘తగ్గేదేలే’ అంటున్న కియా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Kia Seltos: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం ప్లాంట్‌లో ఆల్-న్యూ Seltos ఉత్పత్తిని అధికారికంగా కియా ఇండియా ప్రారంభించింది. దీంతో భారతదేశంలో అత్యంత పోటీ ఉన్న మిడ్-SUV సెగ్మెంట్‌లో కియా తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటుంది. 2019లో ప్రారంభమైన ఈ ఫ్యాక్టరీ నుంచే కియా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ ఏడాది నుంచే Seltos ఉత్పత్తి కూడా ఇక్కడ జరుగుతుండగా, ఇప్పుడు కొత్త తరం అప్‌గ్రేడ్ వెర్షన్ తయారీ దశలోకి ప్రవేశించింది. కాగా, కియా రీడిజైన్ చేసిన Seltos ధరలను జనవరి 2, 2026న అధికారికంగా ప్రకటించనున్నట్టు వెల్లడించింది. 2019 నుంచి కియా ఇండియా పోర్ట్‌ఫోలియోకు ప్రధాన బలంగా నిలిచిన Seltos, ఈ కొత్త జనరేషన్‌లో భారత వినియోగదారుల అంచనాలు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా మరింత రూపుదిద్దుకుంది.
Read Also: Oppo Reno 15 Launch: జనవరి 8న మూడు ‘ఒప్పో’ ఫోన్‌లు లాంచ్.. స్పెక్స్, ధర డీటెయిల్స్ ఇవే!
Also Read
- 890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
- KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
- TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
- Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
అయితే, కొత్త కియా Seltos కారు లోపల ఎక్కువ స్థలం, మెరుగైన స్టెబిలిటీ, డ్రైవింగ్ బ్యాలెన్స్‌ను అందించేలా రూపొందించారు. SUV ఇప్పుడు 4,460 mm పొడవు, 1,830 mm వెడల్పు, 2,690 mm వీల్‌బేస్‌తో అందుబాటులోకి రాబోతుంది. ఈ మార్పుల వల్ల క్యాబిన్ కంఫర్ట్ మరింత మెరుగుపడి, డ్రైవింగ్ స్థిరత్వం పెరుగుతుందని కియా పేర్కొంది. డిజైన్ పరంగా, కియా యొక్క “Opposites United” ఫిలాసఫీ ఆధారంగా SUV లుక్‌ను పూర్తిగా అప్‌డేట్ చేశారు. ఇందులో అప్‌డేట్ అయిన Digital Tiger Face, వెల్‌కమ్ ఫంక్షన్‌తో LED ప్రొజెక్షన్ హెడ్‌ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్, మస్క్యులర్ బాడీ సిల్హౌట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి Seltos కారుకు రోడ్డుపై మరింత పవర్‌ఫుల్ & ఆధునిక గుర్తింపును ఇస్తాయని కంపెనీ తెలిపింది.
Read Also: Security Guard Damages Car: కారుపై తన కోపాన్ని ప్రదర్శించిన సెక్యూరిటీ గార్డ్.. తుక్కు తుక్కైన కారు
ఈ సందర్భంగా Kia India Managing Director & CEO గ్వాంగ్గు లీ మాట్లాడుతూ.. ఆల్-న్యూ Seltos విడుదల, కియా ఇండియాకు గర్వకారణమైందన్నారు. మిడ్-SUV సెగ్మెంట్‌లో Seltos ఇప్పటికే ఎన్నో బెంచ్‌మార్క్‌లు సృష్టించింది. ఈ కొత్త జనరేషన్, భారత కస్టమర్ల అభిప్రాయాలు, అవసరాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత రూపొందిన బిగ్ & ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ అని పేర్కొన్నారు. అనంతపురం ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో, ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ లేకుండా డెలివరీలు అందించేందుకు మా టీమ్ సిద్ధంగా ఉందన్నారు. ఈ కొత్త Seltos సెగ్మెంట్ అంచనాలను మరోసారి మార్చే శక్తి కలిగి ఉందని లీ చెప్పుకొచ్చారు.
కొత్త Kia Seltos లో మూడు ఇంజిన్ ఆప్షన్లు..
* Smartstream G1.5 Petrol – 115 PS, 144 Nm
* Smartstream 1.5 T-GDI Petrol – 160 PS, 253 Nm
* 1.5 CRDi VGT Diesel – 116 PS, 250 Nm
ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు 6MT, 6iMT, IVT, 7DCT, 6AT రూపంలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి కస్టమర్లకు పవర్, స్మూత్ డ్రైవింగ్, ఫ్లెక్సిబుల్ పెర్ఫార్మెన్స్ అనుభూతిని అందిస్తాయని కంపెనీ తెలిపింది. అలాగే, కస్టమర్లు 4 ప్రధాన ట్రిమ్స్- HTE, HTK, HTX, GTX మోడల్స్ నుంచి ఎంచుకోవచ్చు. అదనంగా HTE(O), HTK(O), HTX(A), GTX(A) ఆప్షన్ వేరియంట్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. GTX & GTX(A) వేరియంట్లకు ప్రత్యేకంగా X-Line Styling Pack అందిస్తుండగా, Convenience, Premium, ADAS, X-Line Add-On Packs ద్వారా SUV లను పూర్తిగా తమకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకునే అవకాశం కియా కల్పించింది. అయితే, ఉత్పత్తి ప్రారంభం, కొత్త డిజైన్, పెరిగిన క్యాబిన్ స్పేస్, 3 ఇంజిన్ ఎంపికలు, 5 ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు, అధునాతన ఫీచర్లతో పర్సనలైజేషన్ ప్యాకేజీలతో కియా మరోసారి మిడ్-SUV సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలు సృష్టించేందుకు రెడీ అవుతుంది.
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..