Mini E-Scooter: మినీ సైజ్ ఇ-స్కూటర్… రేంజ్, స్పీడ్, ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుంది.. ఈ క్రమంలో అద్భుతలను సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు.. టూవీలర్ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి సరికొత్త మోడల్స్ లాంఛ్ చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించి, హోండా అంతర్జాతీయ మార్కెట్‌లో సూట్‌కేస్-సైజ్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది.. హోండా మోటోకంపాక్టో పేరుతో లాంఛ్ అయిన ఫోల్డబుల్ ఇ-స్కూటర్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 995 డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.82,000 వేలు ఉంటుంది..
ప్రస్తుతం ట్రైల్స్ లో ఉన్న ఈ బుల్లి స్కూటర్ నవంబర్ నుంచి అందుబాటులోకి రానుంది.. హోండా, అకురా ఆటోమొబైల్ డీలర్ల దగ్గర ఇ-స్కూటర్ కొనొచ్చు. ఇ-స్కూటర్‌ను కాలిఫోర్నియా, ఒహియోలోని కంపెనీ ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్నారు. ఇ-స్కూటర్ బరువు చాలా తక్కువ. కేవలం 19 కిలోలు మాత్రమే. ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా ఈ స్కూటర్‌ను ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. ఈ స్కూటర్‌ను ఫోల్డ్ చేసినప్పుడు సైజ్ 28 అంగుళాలు. ఓపెన్ చేసినప్పుడు సైజ్ 38 అంగుళాలు ఉంటుందని అధికారులు తెలిపారు..
Also Read
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
ఇకపోతే హోండా మోటోకంపాక్టో ఇ-స్కూటర్‌లో 6.8Ah బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 19 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఫుల్ ఛార్జ్ చేయడానికి 3.5 గంటల సమయం పడుతుంది. హోండా మోటోకంపాక్టో ఇ-స్కూటర్‌ను గంటకు 24 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చు.. ఇకపోతే ఈ స్కూటర్ ఫీచర్స్ విషయానికొస్తే..మెత్తని సీటు, సురక్షితమైన గ్రిప్ ఫుట్ పెగ్‌లు, ఆన్-బోర్డ్ స్టోరేజీ, ఛార్జ్ గేజ్, డిజిటల్ స్పీడోమీటర్ లాంటివి ఉన్నాయి. మొదట ఈ స్కూటర్ అమెరికాలో అందుబాటులోకి రానుంది. ఈ వాహనం ఇండియాలో అందుబాటులోకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!