NTV Telugu Site icon

MG Cyberster EV: 580 కి.మీ రేంజ్.. సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న స్పోర్ట్స్‌ కార్

Mg Cyberster Ev

Mg Cyberster Ev

గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ JSW MG మోటార్ ఇండియా.. కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతుంది. 2025లో ఈ కారు విడుదల కానుంది. ఈ కారు లాంచ్‌కు సంబంధించి.. కంపెనీ సమాచారం ఇచ్చింది. 2025 జనవరిలో ఇండియాలో MG సైబర్‌స్టర్‌ను ప్రారంభించనుంది. MG ఎలక్ట్రిక్ స్పోర్ట్స్‌కార్ ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

Read Also: Nargis Fakhri Sister: బ్రేకప్ చెప్పాడని కాల్చి చంపిన హీరోయిన్ చెల్లి అరెస్ట్

MG ఎలక్ట్రిక్ కారు కంపెనీ ప్రీమియం ఎంపిక చేసిన రిటైల్ ఛానెల్ ద్వారా విక్రయించబడుతుంది. కొన్ని నెలల క్రితం.. JSW MG మోటార్ ఇండియా, ప్రీమియం ఆఫర్‌ల కోసం MG సెలెక్ట్ అనే పూర్తిగా కొత్త రిటైల్ ఛానెల్‌ని ప్రకటించింది. రాబోయే MG సైబర్‌స్టర్ ఈ ప్రీమియం డీలర్‌షిప్ చైన్ ద్వారా రిటైల్ చేయబడిన మొదటి ఉత్పత్తి అవుతుంది. 2023 గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో కంపెనీ సైబర్‌స్టర్‌ను మొదటిసారిగా ప్రదర్శించింది. రాబోయే MG ఎలక్ట్రిక్ కారు పొడవు 1,533 mm, వెడల్పు 1,912 mm. ఎత్తు 1,328 mm, వీల్‌బేస్ 2,689 mm.

Read Also: Mahindra BE 6E: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ “BE 6E”పై ఇండిగో కేసు.. వివాదం ఏంటంటే..?

ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 580 కి.మీ..
MG ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ఇప్పటికే అనేక అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 2 బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించారు. 64kWh బ్యాటరీతో కూడిన మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 77kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉన్న మోడల్ దాదాపు 580 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. భారతీయ మార్కెట్‌లో గ్లోబల్ పవర్‌ట్రెయిన్‌ను కూడా కొనసాగించగలదని అనేక మీడియా నివేదికలలో కంపెనీ తెలపింది.

Show comments