NTV Telugu Site icon

MG Windsor EV: దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ కారు.. ఇండియన్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 విజేత..

Mg Windsor Ev

Mg Windsor Ev

దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ కారుగా ఎమ్‌జీ విండ్సర్ ఈవీ అవతరించింది. ఇది ఇండియన్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 విజేతగా నిలిచింది. ఈ కారు ఎలక్ట్రిక్ విభాగంలో బీఎమ్‌డబ్ల్యూ, బీవైడీ వంటి కంపెనీల మోడళ్లను కూడా అధిగమించింది. ఈ విభాగంలో BMW i5 రెండవ స్థానంలో నిలువగా బీవైడీ మూడవ స్థానానికి పరిమితమైంది.

READ MORE: UP: కన్నౌజ్‌ రైల్వే స్టేషన్‌‌లో కూలిన పైకప్పు.. కొనసాగుతున్న సహాయచర్యలు

దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ఎంజీ మోటార్స్​ 2024 సెప్టెంబర్‌లో విండ్సర్ ఈవీని భారత మార్కెట్​లో లాంచ్​ చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .9.99 లక్షలు. సరసమైన ధర, ఫీచర్ లోడెడ్ ఎలక్ట్రిక్ వాహనం కొనాలని చూస్తున్న వారికి ఇదో మంచి ఎంపిక. అయితే.. అప్పుడు ఆ కంపెనీ ధరలో ఒక ట్విస్ట్ పెట్టింది. బ్యాటరీని కారు బేస్ ప్రైజ్​లో చేర్చలేదు. బ్యాటరీని రెంట్‌కి తీసుకుంటే కిలోమీటరుకు రూ.3.5 యూసేజ్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంతో ప్రారంభ ఓనర్​షిప్​ కాస్ట్​- బ్యాటరీ వినియోగ ఖర్చుల మధ్య ఆసక్తికరంగా మారింది.

READ MORE: Maharashtra: ఎంవీఏ కూటమికి బీటలు.. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన(యూబీటీ) నిర్ణయం

కాగా.. కంపెనీ ఎంజీ విండ్సర్ ఈవీ బేస్-స్పెక్ వేరియంట్ ఎగ్జైట్ అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది. బేస్ స్పెక్ లో విండ్సర్ ఈవీ ఎల్​ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్​ఈడీ డీఆర్ఎల్స్​, 17-ఇంచ్​ వీల్స్​ అమర్చారు. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ద్వారా ఎక్ట్సీరియర్ డిజైన్​ను మరింత మెరుగుపరిచింది సంస్థ. క్యాబిన్ లోపల ఫ్యాబ్రిక్ సీట్లు, 60:40 స్ప్లిట్ రేర్​ సీట్​ ఉన్నాయి. ఇన్ఫోటైన్​మెంట్ సిస్టెమ్ వైర్ లెస్ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1-ఇంచ్​ టచ్​స్క్రీన్ యూనిట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, మల్టీ యుఎస్​బీ పోర్ట్​లు, 12వీ పవర్ అవుట్​లెట్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Show comments