దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ కారుగా ఎమ్‌జీ విండ్సర్ ఈవీ అవతరించింది. ఇది ఇండియన్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 విజేతగా నిలిచింది. ఈ కారు ఎలక్ట్రిక్ విభాగంలో బీఎమ్‌డబ్ల్యూ, బీవైడీ వంటి కంపెనీల మోడళ్లను కూడా అధిగమించింది. ఈ విభాగంలో BMW i5 రెండవ స్థానంలో నిలువగా బీవైడీ మూడవ స్థానానికి పరిమితమైంది.
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ‘జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ తన ఎలక్ట్రిక్ కారు ‘విండ్‌సోర్’ ధరలను పెంచింది. విండ్‌సోర్ అన్ని వేరియంట్‌లపై రూ.50 వేలు పెంచుతున్నట్లు కంపనీ ప్రకటించింది. అంతేకాదు ఫ్రీ ఛార్జింగ్ ప్రయోజనాలను కూడా నిలిపివేసింది. విండ్‌సోర్ లాంచ్ సమయంలో ప్రారంభ ధరను 10వేల యూనిట్లు వరకు లేదా డిసెంబర్ 31 వరకు మాత్రమే పరిమితం అని పేర్కొంది. యాదృచ్ఛికంగా విండ్‌సోర్ ఈవీ విక్రయాలు డిసెంబర్‌లోనే 10,000 యూనిట్ల విక్రయ మైలురాయిని చేరుకుంది. దాంతో…