దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ కారుగా ఎమ్‌జీ విండ్సర్ ఈవీ అవతరించింది. ఇది ఇండియన్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 విజేతగా నిలిచింది. ఈ కారు ఎలక్ట్రిక్ విభాగంలో బీఎమ్‌డబ్ల్యూ, బీవైడీ వంటి కంపెనీల మోడళ్లను కూడా అధిగమించింది. ఈ విభాగంలో BMW i5 రెండవ స్థానంలో నిలువగా బీవైడీ మూడవ స్థానానికి పరిమితమైంది.