MG Hector Facelift Launch: సరికొత్త డిజైన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ADAS భద్రత.. రూ.2 లక్షల తక్కువ ధరకు కొత్త హెక్టర్ లాంచ్!
- ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదల
- రూ.2 లక్షల తక్కువ ధరకు హెక్టర్ ఫేస్‌లిఫ్ట్
- సరికొత్త డిజైన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ADAS భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కార్ల తయారీ సంస్థ జేఎన్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ భారత మార్కెట్లో తన వాహన పోర్ట్‌ఫోలియోను పెంచింది. ప్రసిద్ధ ఎస్యూవీ ఎంజీ హెక్టర్ కొత్త మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. కొత్త ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ కారు డిజైన్ అప్డేట్స్, ప్రీమియం ఇంటీరియర్స్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో వచ్చింది. అంతేకాదు తక్కువ ధరకు లాంచ్ అయి కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచింది. రూ.11.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయింది. ఇది పాత మోడల్ కంటే దాదాపు రూ.2 లక్షలు తక్కువ. గత మోడల్ ప్రారంభ ధర రూ.14 లక్షలుగా ఉంది.

Also Read
- Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
- Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్‌తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
- MG Hector Tomahawk EV: 7 సీటర్ SUV సెగ్మెంట్లో గేమ్‌ఛేంజర్..! మహీంద్రా XEVకి పోటీగా కొత్త EV..
- కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
ఎంజీ మోటార్స్ దాదాపు ఆరు సంవత్సరాల క్రితం 2019లో ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశంలో మొట్టమొదటి ఇంటర్నెట్- కనెక్టెడ్ ఎస్‌యూవీగా ఇది లాంచ్ అయింది. ‘ఇంటర్నెట్ ఇన్సైడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఎంజీ కార్లలో ఇది ఒకటి. ఇప్పుడు కంపెనీ ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను అప్గ్రేడ్లతో లాంచ్ చేసింది. ముందు, వెనుక భాగాల్లో కొత్త బంపర్లు, ఆరా హెక్స్ గ్రిల్‌తో రీడిజైన్ చేసిన గ్రిల్‌ను అందించారు. అలాగే కొత్త డిజైన్ అలాయ్ వీల్స్‌ను జోడించారు. ఈ ఎస్యూవీ సెలడాన్ బ్లూ, పెర్ల్ వైట్ రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 5 సీటర్, 6 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది.

రీడిజైన్ చేసిన ఇంటీరియర్స్, సీటింగ్ ఆప్షన్లు:
ఇంటీరియర్ విభాగంలో కూడా ఎంజీ కీలక మార్పులు చేసింది. 5 సీటర్ వేరియంట్‌కు డ్యూయల్ టోన్ ఐస్ గ్రే థీమ్.. 6, 7 సీటర్ వేరియంట్లకు డ్యూయల్ టోన్ అర్బన్ టాన్ థీమ్ ఇచ్చింది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అడ్జస్టబుల్ స్టీరింగ్, కొత్త అప్హోల్స్టరీ, అప్డేటెడ్ డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ ఫినిష్‌లను అందించింది.
బిగ్ టచ్‌స్క్రీన్, కొత్త డిజిటల్ ఫీచర్లు:
ఎంజీ హెక్టర్‌లో ఉన్న 14-ఇంచుల పోర్ట్రెయిట్ స్టైల్ టచ్‌స్క్రీన్‌ను మరింత వేగంగా పనిచేసేలా Smart Boost టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేశారు. కొత్తగా అందించిన i-SWIPE టచ్ జెస్చర్ కంట్రోల్ ద్వారా ఏసీ, మ్యూజిక్, నావిగేషన్ వంటి ఫంక్షన్లను మల్టీ-ఫింగర్ జెస్చర్లతో నియంత్రించవచ్చు. అదనంగా డిజిటల్ బ్లూటూత్ కీ, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అలర్ట్స్, రిమోట్ ఏసీ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భద్రత, డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు:
భద్రత పరంగా హెక్టర్‌లో 360 డిగ్రీ HD కెమెరాను అందించారు. స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా ABS, EBD, ESP, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ ఉన్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో ADAS కూడా అందుబాటులో ఉంది.
ఇంజిన్ పనితీరు:
ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది మాన్యువల్, సీవీటి గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంజిన్ 143 PS పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఓనర్షిప్, ఆఫ్టర్ సేల్స్ ప్యాకేజ్
ఎంజీ తన ‘MG Shield’ ఓనర్షిప్ ప్రోగ్రామ్‌ను హెక్టర్‌లో అందిస్తోంది. ఇందులో 3 సంవత్సరాల అన్లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 3 లేబర్-ఫ్రీ సర్వీసులు ఉన్నాయి. అదనంగా వారంటీ, మెయింటెనెన్స్ ప్యాకేజీలను విస్తరించుకునే అవకాశం కూడా ఉంది.

తాజావార్తలు
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?