JSW తన వాహనాలను MG మోటార్ ఇండియా సెలెక్ట్ ద్వారా లగ్జరీ విభాగంలోకి తీసుకురాబోతోంది. కంపెనీ MG సైబర్‌స్టర్‌ను త్వరలో ప్రారంభించనుంది. సైబర్‌స్టర్ 2 ఎలక్ట్రిక్ డోర్లు కలిగి ఉన్న స్పోర్ట్స్ కారు.. ఈ కారు వివరాలు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో వెల్లడి కానున్నాయి. MG సైబర్‌స్టర్ ఏ ఫీచర్లతో భారత్‌లో ప్రవేశించబోతుందో తెలుసుకుందాం.
Read Also: Ismail Haniyeh: ‘‘హనియేకు పట్టిన గతే హౌతీలకు’’.. హనియే హత్యని అంగీకరించిన ఇజ్రాయిల్..
ఫీచర్లు
ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ఆటోమోటివ్ మార్కెట్‌లలో ఒకటిగా మారింది. భారతీయ బ్రాండ్లే కాకుండా, అనేక విదేశీ కంపెనీలు తమ లగ్జరీ కార్లు విక్రయిస్తున్నారు. అందులో ఒకటి ఎంజీ కూడా. ఇండియా-స్పెక్ సైబర్‌స్టర్ భారీ 77 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది స్పోర్ట్స్ కారు.. కేవలం 3.2 సెకన్లలో 100 km/h వేగాన్ని అందుకుంటుంది. ఈ కారులో అమర్చబడిన బ్యాటరీ AWD లేఅవుట్ కోసం రెండు యాక్సిల్స్‌లో రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లకు శక్తినిస్తుంది. ఇందులో అమర్చిన మోటార్ 510 బిహెచ్‌పి పవర్, 725 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ముందు భాగంలో డబుల్ విష్‌బోన్ సస్పెన్షన్.. వెనుక భాగంలో అసెంబ్లీ మల్టీ-లింక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారులో బయటికి, పైకి తెరుచుకునే డోర్స్ కలిగి ఉంటుంది. అలాగే.. మల్టీ-స్క్రీన్ లేఅవుట్, భారీ సెంటర్ కన్సోల్, స్పోర్టీ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెదర్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్లు డాష్‌బోర్డ్‌లో అందించారు. ఈ స్పోర్ట్స్ కారులో డ్రాప్-టాప్ రూఫ్, ఫ్రేమ్‌లెస్ విండోస్, పూర్తి LED లైటింగ్, పెద్ద చక్రాలు, ఏరోడైనమిక్స్ కోసం పెద్ద అండర్‌బాడీ డిఫ్యూజర్ వంటి వాటిని కలిగి ఉంది.
Read Also: Kunamneni Sambasiva Rao: సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం తగదు..
ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందంటే..?
JSW MG మోటార్ ఇండియా సైబర్‌స్టర్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. MG సెలెక్ట్ ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా ఈ కారును ఇండియాకు తీసుకురానున్నారు. ఈ కారును భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రారంభించవచ్చు. భారతదేశంలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 60 లక్షల నుండి రూ. 70 లక్షల వరకు ఉంటుంది.