Man Of The Hole Brazil: ఆ ఒకే ఒక్కడు.. ఇక లేడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man of the Hole Last Of His Tanaru Tribe Dies In Brazil: బ్రెజిల్‌లోని టనారు ఆదివాసీ తెగకు చివరి వ్యక్తి చనిపోవడంతో.. ఆ తెగ అంతరించిపోయింది. గత 26 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న అతడు.. తాను కట్టుకున్న గుడిసె బయట విగతజీవిగా కనిపించినట్టు అధికారులు వెల్లడించారు. అతనిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో.. సహజంగానే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. అతను ఆగస్టు 23వ తేదీన మృతి చెందినట్టు గుర్తించారు. అతని వయసు 60 సంవత్సరాలు ఉండొచ్చని అనుకుంటున్నారు. తను గొయ్యిలు తవ్వి.. వాటిలో పడే జంతువుల్ని ఆహారంగా తీసుకుంటాడు. దాంతో అతనికి బ్రెజిల్‌లో ‘మ్యాన్ ఆఫ్ హోల్’ అని పిలుస్తారు. అయితే.. ఆ వ్యక్తి పేరేంటో ఎవ్వరికీ తెలీదు.
అసలు ఈ తెగ మనుషులు ఏమయ్యారు? ఆ ఒక్క వ్యక్తే ఎందుకు మిగిలాడు? ఒకప్పుడు ఈ తెగకు చెందిన మనుషులు చాలామందే ఉండేవారు. బొలీవియా బార్డర్‌లో రోండోనియా రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో వీళ్లు నివసించేవాళ్లు. ఈ తెగ వ్యక్తులు ఎవ్వరి జోలికి వెళ్లేవారు కాదు. తమ పని తాము చేసుకునేవారు. అయితే.. 70వ దశకంలో రోండోనియా రాష్ట్రానికి చెందిన భూస్వాములు, అటవీభూముల్లో తమ పొలాలను విస్తరించాలనుకున్నారు. కానీ, ఈ టనారు ఆదివాసీ వాళ్లు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన భూస్వాములు.. వారిపై దాడికి దిగారు. అధునాధన ఆయుధాలతో ఎగబడ్డారు. ఆ దాడిలో ఈ అరుదైన తెగకు చెందిన ఆదివాసీలు చాలామంది చనిపోయారు. ఆ తర్వాత 1995లో అక్రమ గనుల తవ్వకందారులు సైతం ఈ తెగలో మిగిలిన కొంతమందిని సైతం చంపేశాడు. అలా దాడుల్లో అందరూ చనిపోగా.. ఒక్క మ్యాన్ ఆఫ్ హోల్ మాత్రమే మిగిలాడు.
Also Read
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
- Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
- Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
- BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
టనారు తెగకు చెందిన వాళ్లలో కేవలం ఒకే ఒక్కడు మిగిలిన విషయాన్ని బ్రెజిల్ ప్రభుత్వం తెలుసుకొని.. అతనుండే ప్రాంతాన్ని నిషిద్ధం ప్రాంతంగా ప్రకటించింది. అతని జోలికి ఎవ్వరూ వెళ్లకూడదని రూల్ పెట్టింది. అంతేకాదు.. అతడు సంచరించే ప్రాంతాలను సైతం బ్రెజిల్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండేవారు. అతనికి ఏమీ హాని కాకూడదని, ఇతరుల నుంచి అతనికెలాంటి అపాయం కలగకూడదనే ఆ పర్యవేక్షణ. ఈ క్రమంలోనే అతడ్ని పరిశీలించేందుకు ఓ ఉద్యోగి అతని ఇంటివైపు వెళ్లగా.. విగతజీవుడిలా దర్శనమిచ్చాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తనకు చావు దగ్గర పడిందన్న విషయం తెలిసి, ఆ వ్యక్తి తన శరీరంపై స్వయంగా ఈకలు కప్పుకున్నాడు.
తాజావార్తలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?